నరసింహన్ మార్పుపై కేటీఆర్ భావోద్వేగ ట్వీట్

తెలంగాణ రాష్ట్రానికి నూతన గవర్నర్ నియామకం కావడంతో ప్రస్తుత గవర్నర్ నరసింహన్‌ను ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆత్మీయంగా పలకరించారు. అయితే పదేళ్లపాటు గవర్నర్‌గా సేవలంందించిన నరసింహన్‌తో తనకున్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ఆయన ఒక భావోద్వేగ పూరిత ట్వీట్ చేశారు. పదేళ్లుగా నరసింహన్ రాష్ట్రానికి ఎన్నో విషయాల్లో మార్గనిర్దేశం చేశారని పేర్కొన్నారు. అనేక సందర్భాల్లో నరసింహన్‌తో మాట్లాడే అవకాశం కలిగిందంటూ ఆయనతో కలిసి దిగిన ఫోటోలు ట్విట్టర్‌లో […]

నరసింహన్  మార్పుపై కేటీఆర్ భావోద్వేగ ట్వీట్

Edited By:

Updated on: Sep 01, 2019 | 9:38 PM

తెలంగాణ రాష్ట్రానికి నూతన గవర్నర్ నియామకం కావడంతో ప్రస్తుత గవర్నర్ నరసింహన్‌ను ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆత్మీయంగా పలకరించారు. అయితే పదేళ్లపాటు గవర్నర్‌గా సేవలంందించిన నరసింహన్‌తో తనకున్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ఆయన ఒక భావోద్వేగ పూరిత ట్వీట్ చేశారు. పదేళ్లుగా నరసింహన్ రాష్ట్రానికి ఎన్నో విషయాల్లో మార్గనిర్దేశం చేశారని పేర్కొన్నారు. అనేక సందర్భాల్లో నరసింహన్‌తో మాట్లాడే అవకాశం కలిగిందంటూ ఆయనతో కలిసి దిగిన ఫోటోలు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆయన ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండాలని కోరుతున్నట్టుగా ట్వీట్ చేశారు కేటీఆర్. అదే విధంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్‌గా నియమితులైన బండారు దత్తాత్రేయకు కూడా కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.