AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

త్వరలో మున్సిపాలిటీల్లో ఖాళీల భర్తీ

తెలంగాణలోని మున్సిపాలిటీలపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. త్వరలో మున్సిపాలిటీల్లోని ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని, దీనికి కేబినెట్‌ ఆమోదం తెలిపిందని పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు..

త్వరలో మున్సిపాలిటీల్లో ఖాళీల భర్తీ
Sanjay Kasula
|

Updated on: Jul 11, 2020 | 10:40 AM

Share

తెలంగాణలోని మున్సిపాలిటీలపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. త్వరలో మున్సిపాలిటీల్లోని ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని, దీనికి కేబినెట్‌ ఆమోదం తెలిపిందని పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు వెల్లడించారు. హైదరాబాద్‌లో మున్సిపాటీల అభివృద్ధి ప్రణాళికపై ఆర్థిక మంత్రి హరీశ్‌రావుతో కలసి కేటీఆర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. వచ్చే మూడేళ్లలో మున్సిపాలిటీల రూపురేఖలు మార్చేలా అధికారులు, నాయకులు పనిచేయాలని ఆదేశించారు.

ఓ మంచి వ్యూహంతో ముందుకు వెళ్తున్న సిద్దిపేట మున్సిపాలిటీని రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలు ఆదర్శంగా తీసుకొని అభివృద్ధి సాధించాలన్నారు. మున్సిపల్‌ అభివృద్ధికి తాగునీరు, పరిశుభ్రత, పార్కులు, తడి, పొడి చెత్తల సేకరణ, పన్ను వసూళ్లు ఇలా మొత్తం 42 అంశాలను ప్రాతిపదికగా తీసుకోవాలని మంత్రి కేటీఆర్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 400 పాత బస్సులు తీసుకొని షీ టాయిలెట్‌లు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. చెత్త సేకరణను మొక్కుబడిగా కాకుండా నూతన ఒరవడితో సేకరించాలన్నారు. మున్సిపల్‌ కమిషనర్, చైర్మన్‌ ఉదయం 5:30 గంటల నుంచే వార్డుల్లో పర్యటించాలని, అలా అయితేనే ప్రజల సమస్యలు తెలుస్తాయన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి నెలా మొదటి వారంలో నెలకు రూ. 12 వేల చొప్పున వేతనాలు చెల్లించాలని ఆదేశించారు.

Follow Us
తీరం దాటిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
తీరం దాటిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా