గుంటూరు జిల్లాను వణికిస్తున్న కృష్ణమ్మ
గుంటూరు జిల్లాను కృష్ణమ్మ వణికిస్తోంది. తుళ్లూరు మండలంలోని కృష్ణా పరివాహక ప్రాంతాల్లో పరిస్థితి భయానకంగా మారింది. నదీ పరివాహక ప్రాంతాల వెంబడి నివాసం ఉంటున్న మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొన్ని గ్రామలు పూర్తిగా జలదిగ్భంధనమయ్యాయి...

Krishna River Touches : కృష్ణా నది మహోగ్ర రూపం దాల్చుతుంది. గుంటూరు జిల్లాను కృష్ణమ్మ వణికిస్తోంది. తుళ్లూరు మండలంలోని కృష్ణా పరివాహక ప్రాంతాల్లో పరిస్థితి భయానకంగా మారింది. కొన్ని గ్రామలు పూర్తిగా జలదిగ్భంధనమయ్యాయి. ఇతర ప్రాంతాలతో ఆ గ్రామాలకు సంబంధాలు కూడా తెగిపోయాయి. నదీ పరివాహక ప్రాంతాల వెంబడి నివాసం ఉంటున్న మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీనితో పంట పొలాలు మునిగి పోయాయి. సమీప గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు. పలు ప్రాంతాల్లో వాగులు వంకలు మరింత ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో పరిస్థితి భయానకంగా మారింది. ఎగువ నుంచి ఉధృతంగా వస్తున్న వరద నీటితో వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. గుంటూరు జిల్లాలో మిర్చి, పసుపు, పత్తి పంటలు పూర్తిగా నీట మునిగాయి. అమరావతి మండలంలోని మునుగోడులో ఎక్కడ చూసిన నీరే కన్పిస్తోంది. పంటలన్నీ నీట మునగడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.




