కృష్ణా జిల్లాలో ఫేక్ ఆధార్ కార్డుల తయారీ ముఠా అరెస్ట్

కృష్ణా జిల్లాలో ఫేక్ ఆధార్ కార్డుల తయారీ ముఠా అరెస్ట్

కృష్ణాజిల్లాలో ఫేక్ ఆధార్ కార్డు తయారీ ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు.  6 నిందితులు అదుపులోకి తీసుకున్నారు. మరికొందరి కోసం వేట సాగిస్తున్నారు.

Ram Naramaneni

|

Nov 09, 2020 | 5:03 PM

కృష్ణాజిల్లాలో ఫేక్ ఆధార్ కార్డు తయారీ ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు.  6 నిందితులు అదుపులోకి తీసుకున్నారు. మరికొందరి కోసం వేట సాగిస్తున్నారు. రూ. 5 నుంచి 10 వేలు ఇస్తే సదరు ముఠా  క్షణాల్లో నకిలీ ఆధార్ కార్డును సృష్టిస్తోంది ఈ ముఠా.  గుడివాడ , తిరువూరులో ట్యాంపరింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆధార్ కార్డులో 40 ఏళ్లను 60 సంవత్సరాలుగా ఈ ముఠా క్షణాల్లో మార్చేస్తుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం కొందరు ఈ తరహా అక్రమాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇలాంటి చర్యలకు పాల్పడి దొడ్డిదారిన  ప్రభుత్వ పథకాలు పొందుతోన్న  లబ్ధిదారులపై కేసు నమోదు చేస్తామని కృష్ణా జిల్లా ఎస్పి రవీంద్రనాథ్ బాబు చెప్పారు.  నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Also Read :  వ్యవసాయం విలువ తెలుసు : సీఎం జగన్

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu