AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సేవ్ మాన్సస్ ప్రచారంపై మండిపడ్డ సంచయిత

తెలుగుదేశంపార్టీ చేపట్టిన సేవ్ మాన్సస్ అభియాన్‌పై ట్రస్టు ఛైర్మెన్ సంచయిత గజపతి రాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి అశోక గజపతి రాజుపై ధ్వజమెత్తారు. అశోక గజపతి రాజు ఇపుడు...

సేవ్ మాన్సస్ ప్రచారంపై మండిపడ్డ సంచయిత
Rajesh Sharma
|

Updated on: Nov 09, 2020 | 5:57 PM

Share

Sanchayitha fires on Save Mansas Campaign: తెలుగుదేశంపార్టీ చేపట్టిన సేవ్ మాన్సస్ అభియాన్‌పై ట్రస్టు ఛైర్మెన్ సంచయిత గజపతి రాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి అశోక గజపతి రాజుపై ధ్వజమెత్తారు. అశోక గజపతి రాజు ఇపుడు ప్రారంభించిన సేవ్ మాన్సస్ అభియాన్‌ను గతంలో తాను తప్పులకు పాల్పడినపుడు చేపట్టి వుండాల్సిందంటూ ఎగతాళి చేశారు సంచయిత.

మాన్సాస్‌పై ఆధిపత్యం కొనసాగించిన సందర్భంలో అశోక గజపతి రాజు పాల్పడ్డ తప్పులన్నీ ఇపుడు బయటికి వస్తాయంటూ మాన్సాస్ గది నుంచి ఇంకా అస్థిపంజరాలు బయటికి వస్తాయని వ్యాఖ్యానించారు. గతంలో వారు పాల్పడ్డ దుర్వినియోగాన్ని బహిర్గతం చేస్తాయంటూ ట్వీట్ చేశారు. ‘‘వారసత్వ ప్రదేశమైన 150 సంవత్సరాల పురాతన మోతీ మహల్ ప్యాలెస్‌ను మీరు నేలమట్టం చేసినప్పుడు సేవ్ మాన్సాస్ ప్రచారం ప్రారంభించబడాలి.. మార్కెట్ ధర 8,000 ఉన్న ప్రైమ్ లొకేషన్ లో ఉన్న మాన్సాస్ భూమిని ఎకరానికి సగటున 500 రూపాయలకు లీజుకు తీసుకున్నప్పుడు సేవ్ మాన్సాస్ ప్రచారం ప్రారంభించాలి.. మీరు న్యాయవాదిని నియమించనప్పుడు మరియు మాన్సాస్‌కు వ్యతిరేకంగా మాజీ పార్ట్ డిక్రీని అనుమతించినప్పుడు ట్రస్ట్ కు రూ .13 కోట్ల నష్టాన్ని కలిగించినప్పుడు సేవ్ మాన్సాస్ ప్రచారం ప్రారంభించబడాలి.. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం మీరు 2016-2020 నుండి తప్పు డేటాను అప్‌లోడ్ చేసినప్పుడు సేవ్ మాన్సాస్ ప్రచారం ప్రారంభించబడాలి.. దీనివల్ల మాన్సాస్ విద్యా సంస్థలకు రూ .6 కోట్ల నష్టం వాటిల్లినపుడు సేవ్ మాన్సస్ ఉద్యమం ప్రారంభించి వుండాల్సింది.. మీరు 170 మంది స్టూడెంట్ డిగ్రీలు చెల్లనివిగా మారడానికి APSCHE నుండి అవసరమైన అనుమతులు పొందడం మర్చిపోయినప్పుడు సేవ్ మాన్సాస్ ప్రచారం ప్రారంభించబడాలి.. మీరు పుస్తకాలను ఆడిట్ చేయనప్పుడు సేవ్ మాన్సాస్ ప్రచారం ప్రారంభించబడాలి.. ’’ అంటూ గతంలో జరిగిన తప్పిదాలను సంచయిత ఎత్తి చూపుతూ ట్వీట్ చేశారు.

గత టీడీపీ ప్రభుత్వం నుండి 2016 నుండి 30 కోట్ల రూపాయల వరకు పెండింగ్‌లో ఉన్న బకాయిలను ఎందుకు సాధించలేదని సంచయిత ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఎమ్.ఆర్ కాలేజీని ప్రైవేటీకరించడం గురించి మీరు నకిలీ వార్తలను వ్యాప్తి చేశారని మండిపడిన ఆ కాలేజీ అశోక గజపతి రాజు హయాంలోనే ప్రైవేటుగా వుందన్న సంగతి మరిచారా అని నిలదీశారు. ‘‘ నేను మాన్సాస్‌ను సేవ్ చేస్తున్నాను.. దానిని తిరిగి దాని అసలు కీర్తిని తీసుకువస్తున్నాను.. దయచేసి మీ రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడంలో మీరు దృష్టి పెట్టండి.. ఎందుకంటే మీరు ఆసక్తి చూపి మన్సాస్‌ను రాజకీయ ఫుట్‌బాల్‌గా మార్చకుండా ఉండండి..’’ అంటూ అశోక గజపతి రాజుకు సంచయిత సూచనలు కూడా చేశారు.

ALSO READ: సిటీ ట్రాఫిక్ జామ్‌కు కేటీఆర్ చెక్

జీహెచ్ఎంసీకి హడ్కో అవార్డు.. కేటీఆర్ ప్రశంస