క్రిష్ గారూ.. నెక్ట్సేంటి..?

డైరెక్ట‌ర్ క్రిష్‌కు సెన్సిబుల్‌గా సినిమాలు తీస్తాడన్న పేరుంది. కానీ ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్ట్స్ పరాజయం పాలవ్వడం, ‘మణికర్ణిక’ విషయంలో కంగనాతో విబేధాల నేపథ్యంలో క్రిష్ సైలెంటయ్యాడు. ఆ తర్వాత నుంచి ఆయన పబ్లిక్ పంక్షన్స్‌లో కూడా పెద్దగా కనిపించలేదు. ఎన్టీఆర్ బయోపిక్ చాలా పెద్ద ప్రాజెక్ట్ అవ్వడం వల్లనో ఏమో, క్రిష్ పరాజయాన్ని పర్సనల్‌గా తీసుకున్నట్టు కనిపిస్తున్నాడు. మధ్యలో నిర్మాతగా, దిల్ రాజుతో కలిసి అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలో `నూటొక్క జిల్లాల‌ అంద‌గాడు` అనే మూవీని […]

క్రిష్ గారూ.. నెక్ట్సేంటి..?
Ram Naramaneni

| Edited By: Srinu Perla

Dec 13, 2019 | 7:20 PM

డైరెక్ట‌ర్ క్రిష్‌కు సెన్సిబుల్‌గా సినిమాలు తీస్తాడన్న పేరుంది. కానీ ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్ట్స్ పరాజయం పాలవ్వడం, ‘మణికర్ణిక’ విషయంలో కంగనాతో విబేధాల నేపథ్యంలో క్రిష్ సైలెంటయ్యాడు. ఆ తర్వాత నుంచి ఆయన పబ్లిక్ పంక్షన్స్‌లో కూడా పెద్దగా కనిపించలేదు. ఎన్టీఆర్ బయోపిక్ చాలా పెద్ద ప్రాజెక్ట్ అవ్వడం వల్లనో ఏమో, క్రిష్ పరాజయాన్ని పర్సనల్‌గా తీసుకున్నట్టు కనిపిస్తున్నాడు.

మధ్యలో నిర్మాతగా, దిల్ రాజుతో కలిసి అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలో `నూటొక్క జిల్లాల‌ అంద‌గాడు` అనే మూవీని స్టార్ట్ చేశారు. అది ప్రెజంట్ సెట్స్‌పై ఉంది. మరి ఈ టాలెంటెడ్ డైరెక్టర్ నెక్ట్స్ మూవీని ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అనే విషయంపై మాత్రం క్లారిటీ రావడం లేదు. ఎప్పుడో ఫిబ్రవరిలో మహానాయకుడు రిలీజయ్యింది. అప్పుటినుంచి ఇప్పటివరకు క్రిష్ నెక్ట్స్ మూవీపై క్లారిటీ లేదు. ఇటీవలే హాట్ స్టార్ వాళ్లో ఒక వెబ్ సిరీస్‌ చెయ్యడానికి అగ్రిమెంట్ చేయించుకున్నట్టు సమాచారం. అయితే దానికి కథ  మాత్రమే అందిస్తారా..? లేదా దర్శకత్వం కూడా చేస్తారా అనేది తేలాల్సి ఉంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu