లాస్ట్‌ ఫేజ్‌లో మాస్ మహారాజా ‘క్రాక్‌’

లాస్ట్‌ ఫేజ్‌లో మాస్ మహారాజా 'క్రాక్‌'

రవితేజతో గోపిచంద్‌ మలినేని చేస్తున్న లేటెస్ట్ మూవీ క్రాక్‌. ఈ సినిమాలో రవితేజ 'క్రాక్' పోలీస్ ఆఫీసర్‌గా కనిస్తున్నాడు. మాస్ మహరాజ్‌మార్క్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే కంప్లీట్...

Sanjay Kasula

| Edited By: Pardhasaradhi Peri

Nov 11, 2020 | 6:19 PM

Mass Maharaja Ravi Teja : రవితేజతో గోపిచంద్‌ మలినేని చేస్తున్న లేటెస్ట్ మూవీ క్రాక్‌. ఈ సినిమాలో రవితేజ ‘క్రాక్’ పోలీస్ ఆఫీసర్‌గా కనిస్తున్నాడు. మాస్ మహరాజ్‌మార్క్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే కంప్లీట్ అవుతుంది. ఇప్పటికే టాకీ పార్ట్ షూటింగ్ ను ముగించిన రవితేజ సాంగ్స్‌ షూట్‌ కోసం రెడీ అవుతున్నారు.

రవితేజ గోపిచంద్‌ మలినేని కాంబోలో డాన్‌శీను, బలుపు లాంటి హిట్ సినిమాలొచ్చాయి. అందుకే ఈ మూవీ మీద కూడా మాంచి ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా రవితేజలోని ఎనర్జీనంతా యూజ్‌ చేసుకుంటూ పక్కా పోలీస్‌ డ్రామాను రెడీ చేస్తున్నారు గోపీ చంద్‌.

ఈ సినిమాతో మల్టీ టాలెంటెడ్‌ బ్యూటీ శృతి హాసన్‌ రీ ఎంట్రీ ఇస్తున్నారు. కోలీవుడ్ స్టార్స్‌ వరలక్ష్మీ శరత్‌ కుమార్, సముద్రఖని కీ రోల్స్‌లో నటిస్తున్నారు. సాంగ్స్‌ షూట్‌ను కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి సంక్రాంతి సినిమాను రిలీజ్ చేస్తామంటూ ఇప్పటికే డిక్లేర్ చేశారు క్రాక్ టీం.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu