పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను ఆదుకోండి, బైడెన్ కి యాక్టివిస్ట్ అంజాద్ మీర్జా విన్నపం

73 ఏళ్లుగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ పాక్… సామ్రాజ్యవాదానికి బలై నానా కష్టాలు పడుతోందని, ఇక్కడి ప్రజలకు కలిగిన ‘గాయాన్ని’ మాన్పడంలో జోక్యం చేసుకోవాలని  మానవ హక్కుల యాక్టివిస్ట్ అంజాద్ ఆయూబ్ మీర్జా..జో బైడెన్ ని కోరారు. ఈ మేరకు లేఖ రాస్తూ.. పాకిస్తాన్ నియంతృత్వ పోకడ కారణంగా ఇక్కడి ప్రజలు ఇన్నేళ్ళుగా కష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. తాజాగా చైనా అధికారులు కూడా గిల్గిట్ బల్టిస్తాన్ భూభాగాన్ని ఆక్రమిస్తున్నారని, ఇలా పాక్ తో బాటు చైనా నుంచి […]

పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను ఆదుకోండి, బైడెన్ కి యాక్టివిస్ట్ అంజాద్ మీర్జా విన్నపం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 11, 2020 | 6:08 PM

73 ఏళ్లుగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ పాక్… సామ్రాజ్యవాదానికి బలై నానా కష్టాలు పడుతోందని, ఇక్కడి ప్రజలకు కలిగిన ‘గాయాన్ని’ మాన్పడంలో జోక్యం చేసుకోవాలని  మానవ హక్కుల యాక్టివిస్ట్ అంజాద్ ఆయూబ్ మీర్జా..జో బైడెన్ ని కోరారు. ఈ మేరకు లేఖ రాస్తూ.. పాకిస్తాన్ నియంతృత్వ పోకడ కారణంగా ఇక్కడి ప్రజలు ఇన్నేళ్ళుగా కష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. తాజాగా చైనా అధికారులు కూడా గిల్గిట్ బల్టిస్తాన్ భూభాగాన్ని ఆక్రమిస్తున్నారని, ఇలా పాక్ తో బాటు చైనా నుంచి కూడా రెట్టింపు కష్టాలు ఏర్పడుతున్నాయని ఆయన అన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ కు చెందిన అంజాద్ మీర్జా బ్రిటన్ లో ప్రవాస జీవితం గడుపుతున్నారు. దయచేసి మీరు జోక్యం చేసుకుని పాక్ ఆక్రమిత కాశ్మీరీల ఇబ్బందులను పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తనకు అవకాశం ఇస్తే స్వయంగా మిమ్మల్ని కలిసి సమస్యను ఏకరువు పెడతానని  తన లేఖలో పేర్కొన్నారు.