Lifestyle: చలికాలంలో గుండెపోటు ఎక్కువగా రావడానికి కారణాలు ఇవే.. ఈ టిప్స్‌తో చెక్ పెట్టండి ఇలా
ఈ మధ్య కాలంలో ప్రతీ నలుగురిలో ఒకరు గుండె నొప్పితో మరణిస్తున్నారు. ఇక చలి కాలంలో ఎక్కువగా గుండె పోటు వచ్చే ప్రమాదం ఉందని చాలామంది నిపుణులు అంటుంటారు. మరి ఆ వివరాలు ఏంటి.? ఓ సారి ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.

భారతదేశంలోని మరణాలకు ప్రధాన కారణాల్లో గుండె జబ్బు ఒకటి. ప్రతి నాలుగు మరణాలలో ఒకటి గుండె సంబంధిత వ్యాధి వల్ల చనిపోవడం జరుగుతుందని గ్లోబల్ బర్త్డే ఆఫ్ డిసీస్ అధ్యయనం చెబుతోంది. గుండె జబ్బు మరణాలలో 80 శాతం కంటే ఎక్కువ గుండెపోటు స్ట్రోక్ వల్లే సంభవిస్తున్నాయి. గుండె ఆరోగ్యం విషయంలో సాధారణ నమ్మకం ఏమిటంటే కొలెస్ట్రాల్ స్థాయి సాధారణంగా ఉంటే అంతా బాగానే ఉందనుకోవడం. కానీ మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు సాధారణంగా ఉన్నంత మాత్రాన మన గుండె కూడా ఆరోగ్యంగా ఉన్నట్టేనా అంటే అనుమానాలకు తావిస్తోంది. కొలెస్ట్రాల్ కాకుండా గుండెపోటు,బ్రెయిన్ స్ట్రోక్ కు కారణాలు.. దాని గురించి ముందస్తు హెచ్చరిక గా వచ్చే సంకేతాలు.. అలాగే చలి కాలంలో మనం ఎలా జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ అధ్యయనం ప్రకారం తీవ్రమైన చలి వాతావరణం ఆకస్మిక చలిగాలు గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయి. అయితే చలికాలం మొదలైనప్పుడు ఈ ప్రమాదం ఉండదు కానీ రెండు నుంచి ఆరు రోజుల తర్వాత ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అధ్యయనం పేర్కొంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ చివరిలో అత్యధిక సంఖ్యలో గుండెపోటు కేసులు ఉండే సంబంధిత మరణాలు నమోదుతున్నాయని అమెరికన్ అసోసియేషన్ రిపోర్ట్ తెలిపింది. చలిగాలులు,మనిషి జీవనశైలి మార్పులు గుండెపై అదనపు ఒత్తిడిని కలిగిస్తాయని నిపుణులు తెలుపుతున్నారు.
చలికాలంలో గుండెపోటు ప్రమాదం పెరగడానికి నాలుగు ప్రధాన కారణాలు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు శరీరం తనను తాను వెచ్చగా ఉంచుకోవడానికి రక్తనాళాలు సిరలను సంకోచింప చేస్తుంది. దీనివల్ల గుండె తాలూకా ప్రధాన ధమనులు కూడా సంకోచిస్తాయి.. దీని కారణంగా గుండె కు తక్కువ రక్తం, ఆక్సిజన్ చేరుతాయి. చలికాలంలో ప్రజలు తక్కువగా కదులుతారు. తక్కువగా చెమట పడుతుంది. ఇది శరీరంలో ప్లాస్మా లేదా మొత్తం రక్తపరిమానాన్ని పెంచుతుంది. ఇది రక్తపోటు గుండె స్పందన రేటును పెంచి గుండెపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది.
శరీర జీవక్రియ చలికాలంలో కొద్దిగా నెమ్మదిస్తుంది. ప్రజలు తెలియకుండానే అధిక గ్యాలరీలు ఉండే ఆహార పదార్థాలను తింటుంటారు. బయటకు వెళ్లే పనులను, వ్యాయామాన్ని తగ్గించడం వల్ల ఇది అధిక బరువు ,కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని పెంచుతుంది. చలికాలంలో మన శరీరంలోని కొన్ని హార్మోన్ల మార్పులను తెస్తుంది. ఇది రక్తం గడ్డకట్టే పరిస్థితిని పెంచుతుంది.ఈ గడ్డ కట్టిన రక్తం గుండె లేదా మెదడు లో చిక్కుకుంటే అది రక్తప్రసరణను అడ్డుకొని గుండెపోటు లేదా బ్రెయిన్ స్ట్రోక్ కు దారి తీస్తుంది. చలికాలంలో శరీరాన్ని కాపాడుకోవాలంటే చురుగ్గా ఉండటం, మన బరువును అదుపులో ఉంచుకోవడం, అధిక క్యాలరీలు ఇచ్చేటువంటి ఆహారాన్ని తీసుకోకుండా దూరంగా ఉండటం, ఒత్తిడిని తగ్గించడానికి ప్రతిరోజు యోగా ధ్యానం చేస్తూ రోజు కనీసం ఏడు గంటలు నిద్రపోవడం శరీరానికి మంచిదని నిపుణులు చెప్తున్నారు.
