AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓరీ దేవుడో.. మీ ఆస్తులన్నీ అమ్ముకున్న ఈ గులాబీ కొనలేరట..! ప్రపంచంలోనే అత్యంత ఖరీదు..

మీరు 20, 30 లేదా 100-200 రూపాయలకు గులాబీలను చాలాసార్లు కొని ఉంటారు. అనేక రంగుల గులాబీలను కూడా చూసి ఉంటారు. కానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గులాబీ ఒకటి ఉందని మీకు తెలుసా? మీరు ప్రేమించిన ప్రియురాలికి ఆ గులాబీని ఇవ్వాలంటే.. మీ ఆస్తులన్నీ అమ్ముకున్న కొనలేరు.. అవును మీరు చదివింది నిజమే.. ఈ గులాబీ పేరు ఏమిటి.. దాన్ని కొనడానికి ఎంత ఖర్చవుతుంది? కోట్లు పలికే ఆ గులాబీ ఎక్కడ దొరుకుతుందో తెలుసుకుందాం..

ఓరీ దేవుడో.. మీ ఆస్తులన్నీ అమ్ముకున్న ఈ గులాబీ కొనలేరట..! ప్రపంచంలోనే అత్యంత ఖరీదు..
Most Expensive Rose
Jyothi Gadda
|

Updated on: Feb 28, 2025 | 8:36 PM

Share

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గులాబీ పేరు జూలియట్ రోజ్. మీరు ఇప్పటివరకు చాలా గులాబీలు చూసి ఉంటారు. కొని ఉండవచ్చు. వాటి ధర గరిష్టంగా రూ. 50, 100, 1000 లేదా గరిష్టంగా రూ. 2000 ఉంటుంది. కానీ ఈ జూలియట్ రోజ్ ధర చాలా ఎక్కువ. అందరూ దానిని కొనలేరు. దీని సాగు కూడా అంత సులభం కాదని చెబుతారు. ఇది సాధారణ గులాబీ కాదు, దీన్ని పెంచడం చాలా కష్టం. ఈ పువ్వు ఎంతో శ్రమిస్తే గానీ, వికసిస్తుంది. అందుకే దీని ధర కోట్లలో ఉంటుంది.

నివేదికల ప్రకారం,.. ఈ ప్రత్యేకమైన గులాబీని ప్రసిద్ధ పూల వ్యాపారి డేవిడ్ ఆస్టిన్ పెంచారు. అతను అనేక గులాబీలను కలిపి దీనిని తయారుచేశాడు. అప్రికాట్-హ్యూడ్ హైబ్రిడ్ అనే ఈ అరుదైన జాతిని అభివృద్ధి చేయడానికి దాదాపు 15 సంవత్సరాలు పట్టింది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 2006 లో ఈ గులాబీ పువ్వు ఒకటి దాదాపు 10 మిలియన్ పౌండ్లకు (సుమారు రూ. 90 కోట్లు) అమ్ముడైంది. ఇలా ఈ గులాబీ ధర చాలా ఎక్కువగా ఉండటం వల్ల చాలా మంది దీన్ని కొనాలంటే.. వారి ఆస్తులన్నీ అమ్ముకోవాల్సిందే అంటున్నారు. అయితే, కాలక్రమేణా దాని ధరలు తగ్గాయి. కానీ, నేటికీ రోజుకు రూ. 30 మిలియన్లు ఉంటుందని చెబుతున్నారు.

ఈ గులాబీ ఖరీదైనది మాత్రమే కాదు, చాలా అందంగా కూడా ఉంది. దీని సువాసన కూడా ఇతర రకాల కంటే భిన్నంగా మరియు ప్రత్యేకంగా ఉంటుంది. నేటికీ ఇది ప్రపంచంలోనే అత్యంత విలువైన గులాబీగా పరిగణించబడుతుంది. దీని ధర దాదాపు 15.8 మిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు రూ. 130 కోట్లు) ఉంటుందని చెబుతున్నారు. అయితే, ఈ జూలీయెట్‌ రోజ్‌ అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఈ గులాబీ కనీసం మూడు సంవత్సరాలకు ఎండిపోదు. వాడిపోదు.. ఈ కారణంగానే దాని ధర మరింత ప్రత్యేకంగా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

ప్రపంచవ్యాప్తంగా 150 కి పైగా జాతుల గులాబీలు కనిపిస్తాయి. వేలాది హైబ్రిడ్ రకాలు కూడా ఉన్నాయి. అదే సమయంలో, ప్రపంచంలోని పురాతన గులాబీ జర్మనీలోని హిల్డెషీమ్ కేథడ్రల్‌లో కనుగొనబడింది.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..