Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. మార్చిలో ఎన్ని సెలవులో తెలుసా?

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. మార్చిలో ఎన్ని సెలవులో తెలుసా?

Samatha J

|

Updated on: Mar 01, 2025 | 6:52 AM

హోలీ పండగ నుంచి ఉగాది, అలాగే జమాత్ ఉల్-విదా, ఈద్-ఉల్-ఫితర్ వరకు మార్చి నెలలో సంప్రదాయాలతో కూడా పండగలు ఉన్నాయి. ఈ పండగల సమయాల్లో విద్యార్థులకు పండగే. ఎందుకంటే మార్చి నెలలో చాలా రోజుల పాటు ఆదివారాలు కాకుండా ఇతర వారాల్లో సెలవులు వస్తున్నాయి. మార్చి 2025 భారతదేశం అంతటా జరుపుకునే ముఖ్యమైన పండుగల కారణంగా అనేక సెలవులను వస్తున్నాయి. హోలీ పండగ నుంచి ఉగాది, అలాగే జమాత్ ఉల్-విదా, ఈద్-ఉల్-ఫితర్ వరకు ఈ నెల సంప్రదాయాలతో కూడా పండగలు ఉన్నాయి.

హోలికా దాహన్‌ చోటీ హోలీ అని కూడా పిలిచే హోలికా దహన్ మార్చి 13 గురువారం రాత్రి జరుపుకుంటారు. ఇది హోలీ పండుగ ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇక్కడ ప్రజలు స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకొంటారు. మార్చి 14న హోలీ అనేది లక్షలాది మంది జరుపుకునే ప్రధాన భారతీయ పండుగ. ఇది రంగులు ఒకరికొకరు చల్లుకునే పండగ. ఈ పండగ రోజు రకరకాల రంగులతో, రంగుల నీళ్లను చల్లుకుంటూ వైభవంగా జరుపుకొంటారు.మార్చి 28 జమాత్ ఉల్-విదా పండుగ వస్తుంది. రంజాన్ చివరి శుక్రవారం నాడు జరుపుకునే ఈ పండుగ ప్రార్థనలు, ఖురాన్ పారాయణం, దానధర్మాల ద్వారా జరుపుకుంటారు. మార్చి 30న ఉగాది… మరాఠీ, కొంకణి హిందువులకు గుడి పడ్వా కొత్త సంవత్సరం ప్రారంభం. హిందూ క్యాలెండర్‌లో చైత్ర మాసం మొదటి రోజున జరుపుకునే ఇది వసంతకాలం రాకను సూచిస్తుంది. ఉగాది అనేది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సరం. మార్చి 31న భారతదేశంలో ఈద్-ఉల్-ఫితర్ మార్చి 31న జరుపుకుంటారు.

మరిన్ని వీడియోల కోసం :

ప్రధాని మోదీ తీసుకునే సూపర్‌ ఫుడ్‌ ఇదే.. లాభాలు తెలిస్తే షాకవుతారు!

చివరి అమృత్‌స్నాన్‌.. ప్రయాగ్‌రాజ్‌కు కోటి మందికి పైగా.. వీడియో!

ఫంక్షన్‌ హాల్లో కాదు పంట పొలంలో పెళ్లి.. కారణమేంటంటే.. వీడియో

ఆ గ్రహశకలంతో భూమికి తప్పిన ముప్పు.. ఏం జరిగిందంటే..!వీడియో

Published on: Mar 01, 2025 06:49 AM