సినిమాలో పాత్రలు మాత్రమే..నేను అలాంటిదాన్ని కాదు అంటోన్న కియారా అద్వానీ

క్యారెక్టరే అలాంటిది నేను మాత్రం ఆ టైపు కాదంటున్నారు బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. లేటెస్ట్ మూవీ ఇందూకి జవానీలో డేటింగ్ యాప్స్‌తో...

సినిమాలో పాత్రలు మాత్రమే..నేను అలాంటిదాన్ని కాదు అంటోన్న కియారా అద్వానీ

Updated on: Dec 11, 2020 | 9:32 PM

క్యారెక్టరే అలాంటిది నేను మాత్రం ఆ టైపు కాదంటున్నారు బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. లేటెస్ట్ మూవీ ఇందూకి జవానీలో డేటింగ్ యాప్స్‌తో చిక్కుల్లో పడే అమ్మాయి క్యారెక్టర్ ప్లే చేశారు కియారా. అయితే ఈ టాపిక్ మీదే క్లారిటీ ఇచ్చిన బ్యూటీ.. రియల్‌ లైఫ్‌లో నాది ఓల్డ్‌ వరల్డ్ రొమాంటిక్‌ స్టైల్‌ అంటున్నారు.

‘నేను ఇందూ టైప్‌ అస్సలు కాదు.. ఇందూ తన రూల్స్‌ తానే సెట్ చేసుకుంది.. కానీ నేను అలా కాదు’ అంటూ తనవి ఓల్డ్ థాట్స్ అని క్లియర్‌గా చెప్పేశారు. ముఖ్యంగా రొమాంటిక్ లైఫ్‌ విషయంలో నా ఐడియాస్ కాస్త ఓల్డ్‌గా ఉంటాయి.. ఇంకా డేటింగ్ యాప్స్ వాడేంత అప్‌డేట్‌ కాలేదంటూ.. తనకి తానే గుడ్‌ గర్ల్‌ సర్టిఫికేట్‌ ఇచ్చేసుకున్నారు.

సినిమాలో బోల్డ్‌ క్యారెక్టర్స్‌తో రెచ్చిపోతున్న కియారా.. రియల్‌ లైఫ్‌లో మాత్రం ట్రెడిషనల్‌ గర్ల్‌నే అని గట్టిగా చెప్పేందుకు ట్రై చేస్తున్నారు. అయితే మాటలు ట్రెడిషనల్‌గానే ఉన్నా.. అమ్మడి అపియరెన్స్ మాత్రం అలా అస్సలు కనిపించటం లేదని కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు.

Also Read :

అగ్గితో ఆటలొద్దు..సీఎం మమతా బెనర్జీకు గవర్నర్ జగ్​దీప్​​ ధనకర్ డైరెక్ట్ వార్నింగ్

రైతులకు ఆదాయం పెంచే విధానాలపై ఫోకస్ పెట్టండి, బ్యాంకర్లకు సీఎం జగన్ సూచన

బుమ్రా కొట్టిన షాట్​కు గ్రౌండ్‌లో కుప్పకూలిన ఆసీస్ బౌలర్​, నాన్‌స్ట్రైకింగ్‌ ఎండ్‌లో ఉన్న సిరాజ్ పరిగెత్తుకు వెళ్లి..