శరీర దృఢత్వం పేరిట నకిలీ స్టేరైడ్స్ విక్రయిస్తున్న ఇద్దరు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్న వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు

శరీర ధారుడ్యం, దృఢత్వం పేరిట నకిలీ స్టేరైడ్స్ విక్రయిస్తున్న ఇద్దరు సభ్యుల ముఠాను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు...

శరీర దృఢత్వం పేరిట నకిలీ స్టేరైడ్స్ విక్రయిస్తున్న ఇద్దరు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్న వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు
Follow us

|

Updated on: Dec 11, 2020 | 9:28 PM

శరీర ధారుడ్యం, దృఢత్వం పేరిట నకిలీ స్టేరైడ్స్ విక్రయిస్తున్న ఇద్దరు సభ్యుల ముఠాను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరి దగ్గర నుండి 14లక్షల విలువ చేసే వివిధ ఫుడ్ సప్లిమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. జిమ్ కు వెళ్లే యువత టార్గెట్ గా అనబలిక్ స్టేరైడ్స్ ను ఈ ముఠా అమ్ముతున్నట్టు పోలీసులు నిర్ధారించారు. మిస్టర్ ఇండియా, మిస్టర్ వరల్డ్ టైటిల్స్ సాధించినట్టు యువత ను బురిడీ కొట్టిస్తూ ముస్తఫా, జుబేర్ ఇద్దరూ ఈ దందా కొనసాగిస్తున్నారని పోలీసులు తెలిపారు. ప్రమాదకరమైన ఈ స్టేరైడ్స్ తో కిడ్నీ, లివర్, హార్ట్ పై తీవ్ర ప్రభావం ఉంటుందన్నారు. యువతే టార్గెట్ గా పెద్ద ఎత్తున విక్రయాలు జరగుతుండడంతో నిఘా పెట్టిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ముఠా గుట్ట రట్టు చేశారు.