ఏషియన్ పాపులర్ సెల్రబెటీల జాబితాలో ప్రభాస్,ప్రియాంక చోప్రాను వెనక్కినెట్టిసిన రియల్ హీరో
కరోనా సమయంలో వలసకూలీల పాలిట దైవంగా మారాడు సోనూసూద్. ప్రభుత్వసేవలకు పోటీగా పేదలకు సేవలు చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు.

కరోనా సమయంలో వలసకూలీల పాలిట దైవంగా మారాడు సోనూసూద్. ప్రభుత్వసేవలకు పోటీగా పేదలకు సేవలు చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు. ఇప్పటికి సాయం కోరిన ప్రతిఒక్కరిని ఆదుకుంటున్నాడు ఈ సూపర్ మ్యాన్. ఇక ఈ ఏడాది ముగియడానికి మరి కొద్దీ రోజులు మాత్రమే మిగిలిఉన్నాయి. ఈ ఏడాది చాలా సంస్థలు నిర్వహించిన పాపులర్ సెల్రబెటీల జాబితాలో మరియు పలు వెబ్ సైట్ల సెర్చింగ్ జాబితాలో కూడా సోనూసూద్ పేరు టాప్ లో ఉంది.
కరోనా సమయంలో రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్ ను దేశం మొత్తం ప్రసంశించింది. ఆతరవాత సోనూసూద్ అన్న చోట్ల కూడా ట్రెండ్డింగ్ లో ఉన్నాడు. గూగుల్ సెర్చ్ తో పాటు ఇతర సెర్చ్ ల్లో మరియు ఇతర మీడియా సంస్థల 2020 పాపులారిటీ టాప్ సెల్రబెటీల జాబితాలో సోనూసూద్ టాప్ లో ఉన్నాడు. ఇటీవల ప్రముఖ బ్రిటన్ మీడియా సంస్థ వెళ్లడించిన ఏషియన్ పాపులర్ సెల్రబెటీల జాబితాలో సోనూసూద్ ఏకంగా నెం.1 గా నిలిచాడు. బాహుబలి సినిమాతోభారీక్రేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్ ను కూడా సోనూసూద్ పక్కకు నెట్టేశాడు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాను సైతం వెనక్కి నెట్టేసి నెం 1 స్థానంలో సోనుసూద్ నిలిచాడు. సినిమాలతో కంటే చేసిన సేవాకార్యక్రమాలతోనే అంతులేని అభిమానులను సంపాదించుకున్నాడు సోనూసూద్.
