Telangana Municipal elections: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం.. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు
Telangana Municipal elections: తెలంగాణలో మరో కీలకమైన ఎన్నికల సమరానికి.. సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే గ్రామపోరులో గర్జించిన ప్రధాన పార్టీలు.. ఇప్పుడు పురపాలికల్లోనూ సత్తాచాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాయ్. ఈ విషయంలో అధికారపార్టీగా ముందువరసలో ఉన్న అధికార కాంగ్రెస్.. రిజర్వేషన్లు కూడా ఖరారు చేసి, కదనరంగంలోకి దూకేసినట్టే కనిపిస్తోంది.

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫిబ్రవరి రెండో వారంలో మున్సిపల్ ఎన్నికలను నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. జిల్లాల పునర్విభజనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రిటైర్డ్ జడ్జీతో కమిషన్ ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేబినెట్‌లో 18 అంశాలపై చర్చ జరిగింది. మేడారంలో శాశ్వత భవనాల నిర్మాణాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.