కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు, మాజీ ఐఏఎస్ అధికారి శివశంకర్ అరెస్ట్

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మాజీ ఐఏఎస్ అధికారి ఎం.శివశంకర్ ను ఈడీ అరెస్టు చేసింది..ఈ కేసులో నిందితురాలైన స్వప్న సురేష్ తో శివశంకర్ జరిపిన వాట్సాప్ చాటింగ్ ఆధారంగా ఆయనను అరెస్టు చేశామని ఈడీ వర్గాలు తెలిపాయి.

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు, మాజీ ఐఏఎస్ అధికారి శివశంకర్ అరెస్ట్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 29, 2020 | 1:18 PM

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మాజీ ఐఏఎస్ అధికారి ఎం.శివశంకర్ ను ఈడీ అరెస్టు చేసింది..ఈ కేసులో నిందితురాలైన స్వప్న సురేష్ తో శివశంకర్ జరిపిన వాట్సాప్ చాటింగ్ ఆధారంగా ఆయనను అరెస్టు చేశామని ఈడీ వర్గాలు తెలిపాయి. కస్టమ్స్ శాఖలో ఓ సీనియర్ అధికారితో తాను మాట్లాడిన విషయం నిజమేనని, స్వప్న చెప్పినట్టు చేయాలని ఆ అధికారిని కోరానని శివశంకర్ అంగీకరించినట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి. ఈ వాట్సాప్ చాటింగ్ యవ్వారం చూస్తుంటే స్వప్న చేసిన నేరాల్లో ఈయనకు కూడా ప్రమేయం ఉందని స్పష్టంగా తెలుస్తోందని ఈడీ అధికారులు తెలిపారు. తన పదవిని దుర్వినియోగం చేయడమే కాకుండా మరో ప్రభుత్వ అధికారి విధుల్లో కూడా  శివశంకర్ జోక్యం చేసుకున్నట్టు భావిస్తున్నామని వారన్నారు. ఈయన అరెస్టుకు సంబంధించిన కాపీని వారు గురువారం విడుదల చేశారు.