AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అవసరమైతే బీజేపీకైనా ఓటేస్తామంటున్న మాయావతి

ఉత్తరప్రదేశ్‌లో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి.. మొన్నటి వరకు ఫ్రెండ్స్‌గా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్‌ సమాజ్‌పార్టీలు తమ స్నేహబంధాన్ని తుంచేసుకున్నాయి..

అవసరమైతే బీజేపీకైనా ఓటేస్తామంటున్న మాయావతి
Balu
|

Updated on: Oct 29, 2020 | 1:00 PM

Share

ఉత్తరప్రదేశ్‌లో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి.. మొన్నటి వరకు ఫ్రెండ్స్‌గా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్‌ సమాజ్‌పార్టీలు తమ స్నేహబంధాన్ని తుంచేసుకున్నాయి.. ఇకపై ఎస్పీతో ఎలాంటి పొత్తులు ఉండబోవని బీఎస్పీ అధినేత్రి మాయావతి చెప్పేశారు. గత లోక్‌సభ ఎన్నికలప్పుడు ఏర్పడిన మహాగడ్బంధన్‌ నుంచి మాయావతి బయటకు వచ్చేశారు.. రాజ్యసభ ఎన్నికలు ఆ పార్టీల మధ్య చిచ్చు పెట్టింది. సమాజ్‌వాదీ అభ్యర్థి గెలవకూడదన్న ఉద్దేశంతో తనకు మెజారిటీ లేకపోయినా మాయావతి ఓ అభ్యర్థిని పోటిలోకి దించింది.. మాయావతి ఇలా నిర్ణయం తీసుకున్నారో లేదో ఏడుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు.. సమాజ్‌వాదీలో చేరడానికి సంసిద్ధులయ్యారు.. ఇది మాయావతికి కోపం తెప్పించింది.. వెంటనే ఏడుగురు ఎమ్మెల్యేలపై వేటు వేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. ఎస్పీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..

ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా యూపీలో జరిగే ఏ ఎన్నికల్లో అయినా ఎస్పీ అభ్యర్థిని ఓడించడానికి ఎంతవరకైనా వెళతామన్నారు.. అవసరమైతే బీజేపీకైనా ఓటు వేస్తాము తప్ప ఎప్పీకి అస్సలు వేయమని మాయావతి తెలిపారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత సమాజ్‌వాదీ పార్టీ ప్రవర్తన మారిందని, అసలు ఆ పార్టీపై 1995, జూన్‌2వ తేదీ నాడున్న కేసును ఎత్తివేసి పెద్ద పొరపాటు చేశామన్నారు.. ఎమ్మెల్యేలు చౌదరీ అస్లం అలీ, హకీబ్‌లాల్‌ బింగ్‌, మొహమ్మద్‌ ముజ్తాబ్‌ సిద్ధిక్‌, అస్లం రాయిని, సుష్మా పటేల్‌, హరిగోవంద్‌ భార్గవ, బందనా సింగ్‌లపై మాయావతి బహిష్కరణ వేటు వేశారు. ఉత్తరప్రదేశ్‌లో పది రాజ్యసభ స్థానాలకు వచ్చే నెల తొమ్మిదిన ఎన్నికలు జరగనున్నాయి.. అసెంబ్లీలో తనకున్న బలాన్ని అంచనా వేసుకునే బీఎస్పీ రామ్‌జీ గౌతమ్‌ను బరిలో దింపింది.. ఆయన పేరును పది మంది బీఎస్పీ ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు కూడా! అయితే తమ సంతకాలను ఫోర్జరీ చేశారని ఎమ్మెల్యేలు అనడంతో సీన్‌ మారింది..