కొత్త వైరస్..! కోళ్ల నుంచి గబ్బిలాలకు
ఇటీవలి కాలంలో అంతుచిక్కని వైరస్ ప్రభలడంతో ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాతపడ్డాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితులే కేరళలో నెలకున్నాయి. అయితే అక్కడ కోళ్లు మాత్రమే కాదు గబ్బిళాలు కూడా చనిపోవడం ప్రజలను కలవరపెడుతోంది. అసలే కరోనా భయంతో బిక్కబిక్కుమంటూ గడుపుతోన్న వేళ కొజిక్కొడె జిల్లాలో జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే జంతు సంబంధిత అధికారులకు సమాచారం అందించడంతో, వారు వచ్చి చనిపోయిన గబ్బిళాల నుంచి శాంపిల్స్ సేకరించారు. “మా […]

ఇటీవలి కాలంలో అంతుచిక్కని వైరస్ ప్రభలడంతో ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాతపడ్డాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితులే కేరళలో నెలకున్నాయి. అయితే అక్కడ కోళ్లు మాత్రమే కాదు గబ్బిళాలు కూడా చనిపోవడం ప్రజలను కలవరపెడుతోంది. అసలే కరోనా భయంతో బిక్కబిక్కుమంటూ గడుపుతోన్న వేళ కొజిక్కొడె జిల్లాలో జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే జంతు సంబంధిత అధికారులకు సమాచారం అందించడంతో, వారు వచ్చి చనిపోయిన గబ్బిళాల నుంచి శాంపిల్స్ సేకరించారు.
“మా అధికారులు పరీక్షల కోసం చనిపోయిన గబ్బిలాల నుండి నమూనాలను సేకరించారు. చనిపోయినవాటిన్నింటిని కాల్చి బూడిద చేశాం. పరీక్ష ఫలితాలకు కొన్ని రోజులు సమయం పడుతుంది ”అని జిల్లా పశుసంవర్ధక అధికారి డిఆర్ కెవి ఉమా అన్నారు.
కొజిక్కెడ్ జిల్లాలో రెండు పౌల్ట్రీ ఫామ్స్‌లో బర్డ్ ఫ్లూ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కోళ్లు వందల సంఖ్యలో చనిపోవడంతో టెస్టులు చేసిన అధికారులు.. Type-A Influenzaకు సంబంధించిన H5, H7 వైరస్ అందుకు కారణంగా నిర్ధారించారు. దీంతో వెంటనే అలర్టయిన రాపిడ్ రెస్పాన్స్ టీమ్, ఆ కోళ్ల ఫామ్స్‌కు ఒక కిలోమీటర్ పరిధిలో సంచరిస్తోన్న 1200వరకు రకరకాల పక్షుల నమూనాలను సేకరించారు. ఆ కోళ్ల ఫారం నుంచే వైరస్ గబ్బిలాలకు సోకిందని ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. ముందు జాగ్రత్తగా ఆ ప్రాంతానికి 10కిలోమీటర్ల దూరం వరకూ షాపుల్లో కోళ్లను, గుడ్లను అమ్మకాలను నిషేదించారు. నష్టపోయినవారిని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుందని అధికారులు హామి ఇచ్చారు.




