యాసంగి పంటలపై కేసీఆర్ కీలక సందేశం

|

Oct 15, 2020 | 6:37 PM

KCR message on Rabi crops:  తెలంగాణవ్యాప్తంగా వచ్చే యాసంగిలో ఏ ఏ పంటలు వేయాలనే విషయంపై ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు కీలక సందేశం విడుదల చేశారు. ఖరీఫ్ సీజన్‌లో ప్రభుత్వం చెప్పిన పంటలనే వేసి రైతాంగం చక్కటి ఫలితాలు సాధించిందని, వచ్చే యాసంగి సీజన్‌లోను అదే ఒరవడిని కొనసాగించాలని ఆయన రైతులకు సూచించారు. 2020-21 యాసంగి సీజన్‌లో 50 లక్షల ఎకరాల్లో వరిపంట, మరో 15 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేయాలని ముఖ్యమంత్రి […]

యాసంగి పంటలపై కేసీఆర్ కీలక సందేశం
Follow us on

KCR message on Rabi crops:  తెలంగాణవ్యాప్తంగా వచ్చే యాసంగిలో ఏ ఏ పంటలు వేయాలనే విషయంపై ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు కీలక సందేశం విడుదల చేశారు. ఖరీఫ్ సీజన్‌లో ప్రభుత్వం చెప్పిన పంటలనే వేసి రైతాంగం చక్కటి ఫలితాలు సాధించిందని, వచ్చే యాసంగి సీజన్‌లోను అదే ఒరవడిని కొనసాగించాలని ఆయన రైతులకు సూచించారు. 2020-21 యాసంగి సీజన్‌లో 50 లక్షల ఎకరాల్లో వరిపంట, మరో 15 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేయాలని ముఖ్యమంత్రి రైతులకు నిర్దేశించారు. జిల్లాల వారీగా, మండలాల వారీగా, క్లస్టర్ల వారీగా ఏ పంటలు వేయాలనే విషయంలో వ్యవసాయ అధికారులు స్థానికంగా రైతులకు సూచించాలని కోరారు.

యాసంగిలో అమలు చేయాల్సిన నిర్ణీత పంటల సాగు విధానంపై ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఇటీవల జరిగిన వ్యవసాయాధికారుల సమావేశంలో నిర్ణీత పంటల సాగుపై జిల్లాల వారీగా ప్రతిపాదనలు ఇవ్వాలని సీఎం కోరారు. ఆయన ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ అధికారులు క్లస్టర్లు, మండలాలు, జిల్లాల వారీగా యాసంగిలో సాగు చేసే పంటల సాగుపై అంచనాలు రూపొందించారు. దీనిపై గురువారం నాటి సమావేశంలో విస్తృతంగా చర్చించి, ఏ పంట ఎంత మేరకు సాగు చేయాలనే విషయంలో తుది నిర్ణయం తీసుకున్నారు.

వరి పంటను 50 లక్షల ఎకరాల్లో, శనగ 4.5 లక్షల ఎకరాల్లో, వేరుశనగ 4 లక్షల ఎకరాల్లో, మిరపతో పాటు ఇతర కూరగాయలు లక్షన్నర నుంచి రెండు లక్షల ఎకరాల్లో, జొన్న లక్ష ఎకరాల్లో నువ్వులు లక్ష ఎకరాల్లో, పెసర్లు 50 నుంచి 60 వేల ఎకరాల్లో, మినుములు 50 వేల ఎకరాల్లో, పొద్దు తిరుగుడు 30-40 వేల ఎకరాల్లో, ఆవాలు-కుసుమలు-సజ్జలు లాంటి పంటలు మరో 60 నుంచి 70 వేల ఎకరాల్లో సాగు చేయాలని నిర్ణయించారు. ఈ పంటలకు సంబంధించిన విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచినట్లు సీఎం వెల్లడించారు.

వ్యవసాధికారులు సూచించిన మేరకు రైతులు పంటలు సాగు చేయాలని, తద్వారా మంచి ధర పొందాలని సీఎం పిలుపునిచ్చారు. నిర్ణీత పంట సాగు విధానం నిరంతర ప్రక్రియగా జరగాలని సీఎం చెప్పారు. క్లస్టర్ల వారీగా, మండలాల వారీగా, జిల్లాల వారీగా పంట సాగు లెక్కలతో కార్డులు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఒక సీజన్ లో విత్తనాలు వేయడం ముగియగానే, వ్యవసాయ శాఖ మరో సీజన్ లో ఏ పంటలు వేయాలనే విషయంలో కార్యాచరణ ప్రారంభించాలని కేసీఆర్ నిర్ధేశించారు. ఈ విషయంలో రైతుబంధు సమితులు క్రియాశీల పాత్ర పోషించాలని కోరారు.

దసరా పండుగ నాటికి చాలా వరకు రైతు వేదికల నిర్మాణం పూర్తవుతుందని, వాటి ద్వారా రైతులను సంఘటిత పరిచి, సమన్వయ పరచడం సులభం అవుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. ‘‘ ఏ కొత్త విధానమయినా, ఎవరికయినా ఒక్క రోజుతో, ఒక్క ప్రయత్నంతో అలవాటుకాదు.. నిరంతర ప్రక్రియ ద్వారా మాత్రమే నూతన విధానం అలవడుతుంది.. రైతులకు కూడా, వారికి లాభం జరుగుతుందనే విషయాన్ని ఒకటికి నాలుగు సార్లు అర్థం చేయిస్తే అవగాహన, చైతన్యం పెరుగుతాయి ’’ అని సమీక్షలో సీఎం వ్యాఖ్యానించారు.

మక్కల సాగు వద్దే వద్దు

మక్కల ధర, మార్కెట్ విషయంలో అనిశ్చితి నెలకొన్నందున మక్క పంట వేయకపోవడమే శ్రేయస్కరమని సమావేశంలో అధికారులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పరంగా కూడా మక్కల సాగు వద్దనే రైతులకు సూచన చేయడం ఉత్తమమని అధికారులు చెప్పారు. మక్కలకు 900 రూపాయలకు మించి ధర వచ్చే అవకాశం లేదని వారు అంచనా వేశారు. మక్కలు వేస్తే మంచి ధర వచ్చే అవకాశం లేదు కాబట్టి, మక్కల సాగు విషయంలో రైతులే నిర్ణయం తీసుకోవాలని సీఎం కోరారు. మక్కల సాగు వద్దు అనేదే ప్రభుత్వ సూచన అని, అయినప్పటికీ ఎవరైనా రైతులు మక్కలు సాగు చేయాలని భావిస్తే అది వారి రిస్క్ అని సీఎం స్పష్టం చేశారు. ఎంత ధర వస్తే అంతకే అమ్ముకుంటామనుకునే రైతులే మక్కలు పండించుకోవాలన్నారు.

Also read: తెలంగాణ వాతావరణంపై తాజా బులెటిన్

Also read:    నవంబర్ 2 నుంచి ఏపీలో స్కూళ్ళు రీ-ఓపెన్

Also read: ఎట్టకేలకు ముహూర్తం.. రేపే ప్రారంభం

Also read: 15 ఏళ్ళ అమ్మాయిపై 22 రోజులపాటు అఘాయిత్యం

Also read: ఆసియాలో అతిపొడవైన టన్నెల్: తొలి బ్లాస్టింగ్ చేసిన గడ్కరీ

Also read: సోనుసూద్‌కు అరుదైన అవకాశం.. దానికి గుర్తింపుగానే!

Also read: కరోనా వాక్సిన్… క్లినికల్ ట్రయల్స్‌లో కీలక మార్పు

Also read: సముద్రంలో బోటు గల్లంతు