డైరెక్టుగా ఆఫీసులోనే ముద్దు ముచ్చట.. అడ్డంగా దొరికిన డీజీపీ..
కర్ణాటకలో సీనియర్ పోలీసు అధికారి, డీజీపీ రామచంద్రరావు రాసలీలల వ్యవహారానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. డీజీపీ ఒక మహిళతో ఉన్న ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వడం పోలీసు శాఖలో కలకలం రేపింది. రామచంద్రరావు ప్రస్తుతం (పౌర హక్కుల అమలు డీజీపీ) డీసీఆర్‌ఈ డీజీపీగా పనిచేస్తున్నారు.

కర్ణాటకలో సీనియర్ పోలీసు అధికారి, డీజీపీ రామచంద్రరావు రాసలీలల వ్యవహారానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. డీజీపీ ఒక మహిళతో ఉన్న ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వడం పోలీసు శాఖలో కలకలం రేపింది. ఆ వీడియోలోని ఫుటేజ్ 1 సంవత్సరం క్రితం నాటిదని పేర్కొంటున్నారు. రామచంద్రరావు ప్రస్తుతం (పౌర హక్కుల అమలు డీజీపీ) డీసీఆర్‌ఈ డీజీపీగా పనిచేస్తున్నారు.
ఏకంగా ఆఫీసులో సరసాలు..
డీజీపీ రామచంద్రరావు తన కార్యాలయంలో కూర్చుని ఒక మహిళను ముద్దు పెట్టుకుంటున్న ప్రైవేట్ వీడియో వైరల్‌గా మారింది. ఐపీఎస్ అధికారి కుర్చీపై కూర్చుని ఒక మహిళను కౌగిలించుకుంటున్నట్లు కనిపిస్తోంది.. ఈ సంఘటన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన రన్యా రావు ఘటనకు ముందు జరిగిందని పేర్కొంటున్నారు. అతని కుమార్తె రన్యా రావు బంగారం స్మగ్లింగ్ కేసులో పోరాడుతుండగా.. అతని సవతి తండ్రి లైంగిక కార్యకలాపాలకు సంబంధించిన వైరల్ వీడియో ఒక్కసారిగా పోలీస్ డిపార్ట్‌మెంట్ లో సంచలనానికి దారితీసింది.
నాపై కుట్ర జరుగుతోంది..
యూనిఫాంలో ఉన్న మహిళలతో తాను సరసాలాడుతున్నట్లు వైరల్ అవుతున్న వీడియోను ఐజీపీ రామచంద్రరావు ఖండించారు. ఇది తన ఇమేజ్‌ను పెంచుకోవడానికి AI ఉపయోగించి సృష్టించబడిన నకిలీ వీడియో అని పేర్కొన్న ఆయన.. మీడియా అడిగిన ప్రశ్నలకు సరిగా సమాధానం ఇవ్వలేదు.. “ఇది నా ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఒక క్రమబద్ధమైన కుట్ర” అని ఆయన అన్నారు.
గతంలో, దుబాయ్ నుండి అక్రమ బంగారం స్మగ్లింగ్ కేసులో నటి రన్యా రావు అరెస్టు తర్వాత, ఆమె సవతి తండ్రి డిజిపి రామచంద్ర రావు పేరు కూడా ఈ కేసులో చిక్కుకున్నారు.. విమానాశ్రయంలో నటి రన్యాకు ఇచ్చిన ప్రోటోకాల్ పై కర్ణాటక హోం శాఖ దర్యాప్తునకు ఆదేశించింది. బంగారు స్మగ్లింగ్ కేసులో రామచంద్ర రావు కూడా ఉన్నారా? దుబాయ్ నుండి బెంగళూరుకు బంగారాన్ని రవాణా చేస్తున్నప్పుడు ప్రోటోకాల్ దుర్వినియోగంలో ఆయన ప్రమేయం ఉందా అనే దానిపై దర్యాప్తునకు ఆదేశించారు.
రామచంద్రరావు ఎవరు?..
కె. రామచంద్రరావు కర్ణాటక కేడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి, గతంలో కర్ణాటక రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ కు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ADGP), మేనేజింగ్ డైరెక్టర్ (MD) గా పనిచేశారు. 2023 లో, ఆయన DGP గా, కర్ణాటక రాష్ట్ర పోలీస్ హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కు ఛైర్మన్, MD గా పదోన్నతి పొందారు. తరువాత ఆయన పౌర హక్కుల అమలు డైరెక్టరేట్ కు DGP గా నియమితులయ్యారు. ఆయన సవతి కూతురు రన్యా రావుకు సంబంధించిన బంగారం అక్రమ రవాణా కేసుకు సంబంధించి పోలీసు అధికారాలను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై మార్చి 2025 లో ఆయనను తప్పనిసరి సెలవుపై పంపారు.
‘హోం శాఖకు ఘోర అవమానం’..
రామచంద్రరావు రాస లీల వైరల్ వీడియోలో ప్రమేయం ఉన్న అధికారిపై తగిన చర్యలు తీసుకోవాలని మాజీ హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రామచంద్రరావు గతంలో కూడా ఇలాగే ప్రవర్తించారు. అయినప్పటికీ ఆయన ఆ శాఖలోనే కొనసాగారు. కార్యాలయంలో మహిళలతో దురుసుగా ప్రవర్తించడం హోం శాఖకు తీవ్ర అవమానమని ఆయన అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
