లాక్ డౌన్ వేళ.. కరోనా లేని 9 జిల్లాల్లో.. పరిశ్రమలు పున:ప్రారంభం..
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు దేశంలో మీ 3వరకు లాక్ డౌన్ పొడిగించిన విషయం విదితమే. అయితే.. వైరస్ లేని 9 కర్ణాటక జిల్లాల్లో పరిశ్రమలను పునర్ ప్రారంభించాలని కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు దేశంలో మీ 3వరకు లాక్ డౌన్ పొడిగించిన విషయం విదితమే. అయితే.. వైరస్ లేని 9 కర్ణాటక జిల్లాల్లో పరిశ్రమలను పునర్ ప్రారంభించాలని కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప ఆదేశాలు జారీ చేశారు. 9 జిల్లాల్లోని పరిశ్రమల్లో పనిచేసేందుకు రాష్ట్రంలోని కార్మికులను అనుమతిస్తామని సీఎం చెప్పారు. శనివారం నాటి నుంచి పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల కోసం ప్రత్యేకంగా ఏఎస్ఆర్టీసీ బస్సులు నడపాలని కర్ణాటక చీఫ్ సెక్రటరీ విజయభాస్కర్ ఆదేశాలు జారీ చేశారు.
కాగా.. కార్మికులు మాస్క్ లు, గ్లోవ్స్ ధరించి బస్సుల్లో ప్రయాణం చేసేలా చూడాలని చీఫ్ సెక్రటరీ ఆదేశించారు. బస్సుల్లో కేవలం 40 శాతం ప్రయాణికులు సామాజిక దూరం పాటించేలా చూడాలని ఆయన కోరారు. యాద్గిర్, కొప్పాల్, రాయచూర్, హవేరీ, శివమొగ్గ. చిక్కమంగళూరు, హాసన్, చామరాజనగర్, కోలార్ జిల్లాల్లో పరిశ్రమలు నడిచేందుకు అనుమతిస్తున్నట్లు చీఫ్ సెక్రటరీ చెప్పారు. 9 జిల్లాల్లో చిన్నతరహా పరిశ్రమలు సైతం నడిచేందుకు అనుమతి ఇస్తున్నామని చెప్పారు. చిన్న, మధ్యతరహా, పెద్ద పరిశ్రమల పునర్ ప్రారంభంతో కార్మికులకు ఉపాధి లభించనుంది.



