Happy Birthday Kapil Dev: దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అత్యున్నత గుర్తింపు. . నేడు కపిల్‌దేవ్ పుట్టిన రోజు
Happy Birthday Kapil Dev: ప్రముఖ క్రికెట్ క్రీడాకారులు కపిల్‌దేవ్ భారత క్రికెట్ జట్టుకు ఎనలేని సేవలందించి దేశంలోని కాదు.. ప్రపంచంలోనే అత్యున్నత అల్....
Happy Birthday Kapil Dev: ప్రముఖ క్రికెట్ క్రీడాకారులు కపిల్‌దేవ్ భారత క్రికెట్ జట్టుకు ఎనలేని సేవలందించి దేశంలోని కాదు.. ప్రపంచంలోనే అత్యున్నత అల్‌రౌండర్‌లతో ఒకడిగా పేరు సంపాదించుకున్నారు. నేడు కపిల్‌దేవ్ పుట్టిన రోజు. 1956 జనవరి 6న ఛండీఘర్‌లో జన్మించారు. కపిల్ సారథ్యం వహించిన ఏకైక ప్రపంచ కప్ 1983లో భారత్‌ను విశ్వవిజేతగా తీర్చిదిద్దాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించే నాటికి అత్యధిక టెస్ట్ వికెట్లు సాధించిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. 1999 అక్టోబర్ నుంచి 2000 ఆగస్టు వరకు 10 మాసాల పాటు భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు.
అయితే కుడిచేతి పేస్ బౌలర్ అయిన కపిల్ దేవ్ తన క్రీడా జీవితంలో అత్యధిక భాగం తనే భారత జట్టు ప్రధాన బౌలర్‌గా రాణించాడు. 1980లలో ఇన్‌స్వింగ్ యార్కర్ బౌలింగ్ వేసి చివరి దశ బ్యాట్స్‌మెన్‌లను హడలెత్తించాడు. బ్యాట్స్‌మెన్ గానూ పలు పర్యాయాలు జట్టుకు విజయాలు అందించాడు. జట్టు ఆపత్కాల దశలో ఉన్నప్పుడు బ్యాటింగ్‌లో విరుచుకుపడి ప్రత్యర్థులను సవాలు చేసేవాడు. దీనికి ముఖ్య ఉదాహరణ 1983 ప్రపంచ కప్ పోటీలలో జింబాబ్వేపై జరిగిన వన్డే పోటీగా చెప్పవచ్చు. దేశవాళి పోటీలలో హర్యానా క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే ఇతడి ముద్దుపేరు హర్యానా హరికేన్.
ఇదిలావుంటే.. హర్యానా హరికేన్‌గా ప్రసిద్ది చెందిన కపిల్‌దేవ్ సారథ్యంలో భారత జట్టు 1983లో వన్డే ప్రపంచ కప్‌ను తొలిసారిగా కైవసం చేసుకుంది. టెస్ట్ క్రికెట్‌లో 4000 పరుగులు చేసి, 400 వికెట్లు తీసి డబుల్ ఫీట్ సాధించిన తొలి ఆల్‌రౌండర్‌గా రికార్డు సృష్టించాడు.
కాగా, కపిల్‌ను భారత ప్రభుత్వం 1982లో పద్మశ్రీ, 1991లో పద్మవిభూషన్ అవార్డులతో సత్కరించింది. జింబాబ్వేపై కీలక సమయంలో వీరోచిత బ్యాటింగ్‌తో 175 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కపిల్‌దేవ్ తన కెరీర్‌లో 131 టెస్ట్ మ్యాచ్‌లు, 225 వన్డే మ్యాచ్‌లు ఆడారు. టెస్ట్‌ల్లో 434 వికెట్లు, వన్డేల్లో 253 వికెట్లు తీసి రికార్డు సాధించారు.
కపిల్ దేవ్ తల్లిదండ్రులు రాంలాల్ నిఖంజ్, రాజ్ కుమారీలు. వారి స్వస్థలం పాకిస్తాన్ లోని రావల్పిండి సమీపంలోని ఒక గ్రామం. దేశ విభజన సమయంలో భారత్‌కు తరలివచ్చి ఛండీఘర్‌లో స్థిరపడ్డారు. తండ్రి రాంలాల్ భవనాల, కలప వ్యాపారంలో రాణించాడు. డి.ఏ.వి.కళాశాలలో విద్యనభ్యసించిన కపిల్ దేవ్.. 1971లో దేశ్ ప్రేమ్ ఆజాద్ శిష్యుడిగా చేరవయ్యాడు. అతని వల్లనే 1979 రోమీ భాటియా పరిచయం అయింది. 1980లో వారి వివాహానికి కూడా ఆజాదే చొరవ చూపినాడు. 1996లో కపిల్ దంపతులకు జన్మించిన కూతురు అమియాదేవ్. క్రికెట్‌లో రాణించిన కపిల్ ఎన్నో విజయాలు సాధించి మంచి పేరు సంపాదించుకున్నారు.