ఈ ప్రపంచం హీరోయిన్లను చూసే విధానాన్ని మార్చిన విప్లవాత్మకతల్లికి నివాళులర్పించడం గర్వంగా ఉంది : కంగనా రనౌత్
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, తమిళ తలైవి, అలనాటి ప్రముఖ సినీనటి జయలలిత వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి...
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, తమిళ తలైవి, అలనాటి ప్రముఖ సినీనటి జయలలిత వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించింది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. ఈ ప్రపంచం నటీమణుల్ని చూసే విధానాన్ని మార్చిన విప్లవాత్మకతల్లికి నివాళులర్పించడం గర్వంగా ఉందని ఈ సందర్భంగా కంగనా పేర్కొంది. కాగా, ఫిబ్రవరి 24, 1948న జన్మించిన జయలలిత డిసెంబరు 5, 2016 న తుదిశ్వాస విడిచారు. రాజకీయాలలోకి రాకముందు తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో సుమారు 140 సినిమాల్లో జయలలిత హీరోయిన్ గా నటించారు. 2016, డిసెంబరు 5, రాత్రి 11:30 గంటలకు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో జయ మరణించారు.
ఇదిలాఉంటే, కంగనా రనౌత్ తాజాగా జయలలిత బయోపిక్(తలైవి)లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన కొన్ని స్టన్నింగ్ ఫోటోలను కూడా కంగనా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరో వారం రోజుల్లో సినిమా పూర్తికానుందని పేర్కొన్న ఆమె, ఈ సందర్శంగా సూపర్ హ్యూమన్‌లా సినిమాను తెరకెక్కిస్తున్న విజయ్‌తోపాటు, తలైవి చిత్ర యూనిట్‌కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జయలలిత బయోపిక్ ‘తలైవి-ది రివల్యూషనరీ లీడర్’ లో కంగనా రనౌత్ లీడ్ రోల్ పోషిస్తోంది. షూటింగ్ కార్యక్రమాలను శరవేంగా పూర్తి చేసుకుంటోన్న ఈ సినిమాని హితేష్ ఠక్కర్, తిరుమల్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హిందీ, తమిళం తెలుగు భాషలలో ఈ సినిమా విడుదల కాబోతోంది.
உலகம் நடிகைகளை பார்க்கும் கண்ணோட்டத்தை மாற்றிய, நமது புரட்சித்தலைவி அம்மா அவர்களின் நினைவு நாளில் மலரஞ்சலி செலுத்த பெருமைபடுகிறேன்.
பெண்மையைப் போற்றுவோம். pic.twitter.com/odTEUTjN9F
— Kangana Ranaut (@KanganaTeam) December 5, 2020
On the death anniversary of Jaya Amma, sharing some working stills from our film Thalaivi- the revolutionary leader. All thanks to my team, especially the leader of our team Vijay sir who is working like a super human to complete the film, just one more week to go ? pic.twitter.com/wlUeo8Mx3W
— Kangana Ranaut (@KanganaTeam) December 5, 2020