కాకినాడ రేవులో భారీ చేపలు..!
కాకినాడ పోర్టు ఏరియా కుంభాభిషేకం సముద్రపు రేవులో మత్స్యకారులకు భారీ చేపలు చిక్కాయి. చాలా రోజుల విరామం తర్వాత వేట ప్రారంభించిన మత్స్యకారుల వలకు రెండు భారీ చేపలు చిక్కాయి

కాకినాడ పోర్టు ఏరియా కుంభాభిషేకం సముద్రపు రేవులో మత్స్యకారులకు భారీ చేపలు చిక్కాయి. చాలా రోజుల విరామం తర్వాత వేట ప్రారంభించిన మత్స్యకారుల వలకు రెండు భారీ చేపలు చిక్కాయి. ఈ చేపలు క్వింటాల్‌కు పైగా బరువుండడం మత్స్యకారుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. లాక్ డౌన్ కారణంగా చేపల వేట నిలిపివేసిన మత్స్యకారులు తిరిగి సముద్ర వేటకు వెళ్లారు. మత్స్యకారుల వలకు రెండు పెద్ద చేపలు దొరికికాయి. వీటిని బోటు నుంచి పైకి తీసుకు వచ్చిన మత్స్యకారులు.. వాటి బరువును చూసి అవాక్కయ్యారు. ఒక చేప సుమారు 125 కేజీల బరువుండగా.. మరో చేప 115 కేజీల బరువు ఉందంటున్నారు మత్స్యకారులు. రెండు చేపలు కలిపి సుమారు 250 కేజీలుండడం విశేషం. గతంలో ఇంత భారీ చేపలు చూడలేదని స్థానికులు అంటున్నారు.
