AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్లోబల్ స్పేస్ మార్కెట్ లో ప్రైవేట్ కంపెనీలు ! ప్రభుత్వ యోచన.. ఇస్రో తర్జనభర్జన

భారత అంతరిక్ష కార్యక్రమం (స్పేస్ ప్రోగ్రాం) లో ప్రైవేటు రంగానికి అవకాశం కల్పిస్తే ఎలా ఉంటుంది ? భారత ప్రభుత్వం ప్రస్తుతం ఇదే విషయమై యోచిస్తోంది....

గ్లోబల్ స్పేస్ మార్కెట్ లో ప్రైవేట్ కంపెనీలు ! ప్రభుత్వ యోచన.. ఇస్రో తర్జనభర్జన
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 04, 2020 | 5:35 PM

Share

భారత అంతరిక్ష కార్యక్రమం (స్పేస్ ప్రోగ్రాం) లో ప్రైవేటు రంగానికి అవకాశం కల్పిస్తే ఎలా ఉంటుంది ? భారత ప్రభుత్వం ప్రస్తుతం ఇదే విషయమై యోచిస్తోంది. నిజానికి ఈ ప్రతిపాదన ప్రొఫెసర్ సతీష్ ధావన్ నాయకత్వ హయాంలోనే వచ్చింది. ఈ కార్యక్రమంలో ఈ రంగానికి భాగస్వామ్యం కల్పిస్తే దీని నుంచి ఇస్రో సంబంధిత సర్వీసులను గానీ, బై బ్యాక్ ప్రొడక్టును గానీ షేర్ చేసుకోగలుగుతుందా అన్న అంశం ఆధారంగా సతీష్ ధావన్ ఓ మోడల్ ని రూపొందించారు. ఇస్రోకు చెందిన శాస్త్రవేత్తలు తమ మేధా సంపత్తిని నిరూపించుకుంటూనే తమకు సంబంధించిన రొటీన్ వర్క్ ని తగ్గించుకోగలుగుతారా అన్నది ప్రశ్న. ఇక ప్రైవేటు వ్యక్తుల దృక్పథం మరోలా ఉంది. అంతరిక్ష కార్యక్రమంలో భాగస్వాములు కావాలని తమను ఆహ్వానిస్తే ఎలా స్పందించాలని వారు  యోచిస్తున్నారు. ఇప్పటికే ఇస్రోకు సుమారు 500 కంపెనీలు.. రాకెట్లు, ఉపగ్రహాలకు అవసరమైన విడి భాగాలను అందిస్తున్నాయి. వీటిలో కొన్ని ప్రభుత్వ రంగ కంపెనీలు కూడా ఉన్నాయి. ఈ కంపెనీల సేవల గురించి ఇస్రో చైర్మన్ కె.శివన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరించారు కూడా. అయితే ముఖ్యంగా వీటిలో 150 కంపెనీలు  ఇస్రోకు ఎక్కువగా  తమ వంతు సేవలను అందిస్తున్నాయి. ఒకవిధంగా.. రాకెట్లు, శాటిలైట్ల అసెంబ్లింగ్ లో వీటితో బాటు కొన్ని ప్రైవేటు సంస్థలు సైతం ఈ ప్రోగ్రామ్ విషయంలో సరికొత్త ఆలోచనలు చేస్తున్నాయి.

గ్లోబల్ మార్కెట్ లో శాటిలైట్ల విక్రయం, ఇమేజీలతో కూడిన సర్వీసులను అందించడం వల్ల తన కస్టమర్ బేస్ ను ఈ రంగం బలపరుచుకోగలుగుతుందా అని ఇస్రో తర్జనభర్జన పడుతోంది. ఇక బడ్జెట్ విషయానికి వస్తే భారత అంతరిక్ష కార్యక్రమానికి ఎన్ని వేల కోట్లు కేటాయిస్తారన్నది ఇంకా తెలియడంలేదు. ఇలా పలు అంశాలను అంతరిక్ష పరిశోధనా సంస్థ సమీక్షిస్తోంది. కొన్ని స్పేస్ స్టార్టప్ లు ఇస్రోకు తోడ్పాటునందించడానికి సిధ్ధంగా ఉన్నాయి. తమ కృషిలో ఇవి ఎంతవరకు సక్సెస్ అవుతాయి…. ఇస్రో పాత్ర ఎలా ఉండబోతుందన్నది ఇంకా తేలాల్సి ఉంది.