AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో కొత్తగా 16 మెడికల్‌ కళాశాలలు: ఆళ్లనాని

కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఏపీలో వైద్య ఆరోగ్యశాఖను బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని

ఏపీలో కొత్తగా 16 మెడికల్‌ కళాశాలలు: ఆళ్లనాని
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 04, 2020 | 5:13 PM

Share

కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఏపీలో వైద్య ఆరోగ్యశాఖను బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని ఆ శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునికీకరణ చేస్తున్నామన్నారు.

కాగా.. అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను ఆధుకీకరిస్తున్నట్లు మంత్రి తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ వైద్య కళాశాల కోసం ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి, రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి విజయనగరం జిల్లా కేంద్రంలో స్థల పరిశీలన చేశారు. అనంతరం స్థలం ఎంపికపై అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించారు.

మరోవైపు.. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 11 మెడికల్‌ కళాశాలలతోపాటు కొత్తగా మరో 16 మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించినట్లు తెలిపారు. ఒక్కో కాలేజీకి 1000 కోట్లు చొప్పున.. మొత్తం రూ.16 వేల కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. వీటి నిర్మాణానికి ఆగస్టు నెలలో టెండర్లు పిలవనున్నట్లు మంత్రి ఆళ్లనాని స్పష్టం చేశారు.

Also Read: టెన్త్ విద్యార్థుల కోసం.. నేటి నుంచి తెరుచుకోనున్న సంక్షేమ హాస్టళ్లు..