సేవలు అందించినా.. న్యాయం జరగలేదు: పవన్‌పై నటి ఫైర్

సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తన సేవలను వాడుకొని, ఆపై అన్యాయం చేశారని జూనియర్ ఆర్టిస్ట్ బోయ సునీత సంచలన ఆరోపణలు చేసింది. జనసేన పార్టీ కోసం తాను అహర్నిశలు శ్రమించానని.. తనను ఆదుకుంటానని చెప్పి వాడుకొని, ఇప్పుడు తప్పుడు కేసులు పెడుతున్నారని ఆమె ఆరోపించింది. మంగళవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఫిల్మ్ చాంబర్‌లోకి వెళ్లిన సునీత.. రాత్రంతా ఒక రూమ్‌లో తనను బంధించుకొని నిరసనకు దిగింది. పవన్‌ స్వయంగా వచ్చి సమాధానం చెబితేనే […]

సేవలు అందించినా.. న్యాయం జరగలేదు: పవన్‌పై నటి ఫైర్
Follow us

| Edited By:

Updated on: Sep 04, 2019 | 11:59 AM

సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తన సేవలను వాడుకొని, ఆపై అన్యాయం చేశారని జూనియర్ ఆర్టిస్ట్ బోయ సునీత సంచలన ఆరోపణలు చేసింది. జనసేన పార్టీ కోసం తాను అహర్నిశలు శ్రమించానని.. తనను ఆదుకుంటానని చెప్పి వాడుకొని, ఇప్పుడు తప్పుడు కేసులు పెడుతున్నారని ఆమె ఆరోపించింది. మంగళవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఫిల్మ్ చాంబర్‌లోకి వెళ్లిన సునీత.. రాత్రంతా ఒక రూమ్‌లో తనను బంధించుకొని నిరసనకు దిగింది.

పవన్‌ స్వయంగా వచ్చి సమాధానం చెబితేనే తాను బయటికి వస్తానని ఈ సందర్భంగా ఆమె బెట్టు చేసింది. దీంతో ఆమెను బయటకు రప్పించేందుకు అక్కడున్న పలువురు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. విషయం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు.. ఉదయం 6గంటల సమయంలో ఫిల్మ్‌ ఛాంబర్ కార్యాలయానికి వచ్చి, బలవంతంగా తలుపులు తెరిచారు. సునీతను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే పబ్లిసిటీ స్టంట్ కోసమే ఆమె ఇలాంటి ఆరోపణలు చేస్తుందని జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు కొట్టి పారేస్తున్నారు.

అయితే మరో కథనం ప్రకారం..  గీతా ఆర్ట్స్‌లో ఛాన్స్‌లు ఇప్పిస్తానని చెప్పి ప్రముఖ నిర్మాత బన్నీ వాసు తనకు అన్యాయం చేశారని కూడా బోయ సునీత ఆరోపిస్తోంది. దీనిపై అల్లు అరవింద్ స్పందించాలంటూ ఆమె ఆందోళన చేసినట్లు తెలుస్తోంది. కాగా జూనియర్ ఆర్టిస్ట్‌గా చేసిన ఈమె.. సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై ఆరోపణలు చేసింది. కత్తి మహేష్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

Pawan Kalyan

బేకరీల్లో లభించే ఆనియన్ కచోరిని ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చిలా!
బేకరీల్లో లభించే ఆనియన్ కచోరిని ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చిలా!
ఇక్కడి చింతచెట్టు గింజలు ఎక్కడా మొలకెత్తవు ఈ ఆలయంలో అన్నీ వింతలే
ఇక్కడి చింతచెట్టు గింజలు ఎక్కడా మొలకెత్తవు ఈ ఆలయంలో అన్నీ వింతలే
మీ జనన ధృవీకరణ పత్రం పోయిందా..?  ఇలా దరఖాస్తు చేసుకోండి!
మీ జనన ధృవీకరణ పత్రం పోయిందా..?  ఇలా దరఖాస్తు చేసుకోండి!
గుండె జబ్బులున్న వారు ఎక్కువ నీరు తాగకూడదా? నిపుణులు ఏమంటున్నారు?
గుండె జబ్బులున్న వారు ఎక్కువ నీరు తాగకూడదా? నిపుణులు ఏమంటున్నారు?
పీతల కర్రీ చేయడం రాదా.. ఇదిగో ఈ రెసిపీ ఫాలో అయిపోండి!
పీతల కర్రీ చేయడం రాదా.. ఇదిగో ఈ రెసిపీ ఫాలో అయిపోండి!
ఎర్ర ఉల్లిగడ్డ, తెల్ల ఉల్లిగడ్డలో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా.?
ఎర్ర ఉల్లిగడ్డ, తెల్ల ఉల్లిగడ్డలో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా.?
నిశిధీలో అందాల రాకూమారి.. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్..
నిశిధీలో అందాల రాకూమారి.. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్..
మీక్కూడా తినగానే ఈ అలవాటు ఉందా.? దంతాలు డేంజర్‌లో పడ్డట్లే..
మీక్కూడా తినగానే ఈ అలవాటు ఉందా.? దంతాలు డేంజర్‌లో పడ్డట్లే..
ఇంట్లో ఏ దిక్కులో ఏ ఫొటోలు పెట్టాలో తెలుసా.?
ఇంట్లో ఏ దిక్కులో ఏ ఫొటోలు పెట్టాలో తెలుసా.?
ఈ సూపర్ క్యూట్ చిన్నారి ఎవరో గుర్తుపట్టగలరా ?..
ఈ సూపర్ క్యూట్ చిన్నారి ఎవరో గుర్తుపట్టగలరా ?..