AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విద్యార్థులకు గుడ్ న్యూస్.. పీజీ దరఖాస్తులకు జూన్ 30 తుది గడువు..

కోవిద్-19 రోజురోజుకు విజృంభిస్తోంది. లాక్‌డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. ఈ క్రమంలో విద్యార్థులకు అంబేద్కర్ యూనివర్సిటీ గుడ్ న్యూస్ అందించింది. పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు 2020-21 విద్యా సంవత్సరంలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. పీజీ ప్రవేశాల్లో చేరేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను కోరుతోంది. కాగా BRAUSKLMCET 2020-21 ప్రవేశ పరీక్ష ద్వారా యూనివర్సిటీతో పాటు అనుబంధంగా ఉన్న ఎనిమిది […]

విద్యార్థులకు గుడ్ న్యూస్.. పీజీ దరఖాస్తులకు జూన్ 30 తుది గడువు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 31, 2020 | 6:38 PM

Share

కోవిద్-19 రోజురోజుకు విజృంభిస్తోంది. లాక్‌డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. ఈ క్రమంలో విద్యార్థులకు అంబేద్కర్ యూనివర్సిటీ గుడ్ న్యూస్ అందించింది. పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు 2020-21 విద్యా సంవత్సరంలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. పీజీ ప్రవేశాల్లో చేరేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను కోరుతోంది.

కాగా BRAUSKLMCET 2020-21 ప్రవేశ పరీక్ష ద్వారా యూనివర్సిటీతో పాటు అనుబంధంగా ఉన్న ఎనిమిది సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ప్రవేశ పరీక్షలో అర్హత పొందిన విద్యార్థులకు పీజీ కోర్సుల్లో 620 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 496 రెగ్యులర్, 124 సెల్స్ ఫైనాన్స్ సీట్లు ఉన్నాయి. తొమ్మిది సైన్స్ కోర్సుల్లో 230 సీట్లు ఉండగా, వీటిలో రెగ్యులర్ 184 సీట్లు, 46 సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఉన్నాయి. పది ఆర్ట్స్ కోర్సుల్లో 390 సీట్లలో వీటిలో 312 రెగ్యులర్, 78 సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ఇతర వివరాలకు, దరఖాస్తుకు www.braudoa.inను సంప్రదించాలి.

Also Read: త్వరలో.. మార్కెట్లోకి కరోనావైరస్ టెస్ట్ కిట్.. 10 నిమిషాల్లో ఫలితం..