ఓట్లే కీలకం, ఇక మాదే విజయం, జో బైడెన్ ధీమా
అమెరికా ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక తమదే విజయమని డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ ప్రకటించారు. ఓట్లను ఇంకా లెక్కించవలసి ఉన్న రాష్ట్రాల్లో ట్రంప్ కన్నా తానే ఆధిక్యతలో ఉన్నానన్నారు.

అమెరికా ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక తమదే విజయమని డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ ప్రకటించారు. ఓట్లను ఇంకా లెక్కించవలసి ఉన్న రాష్ట్రాల్లో ట్రంప్ కన్నా తానే ఆధిక్యతలో ఉన్నానన్నారు. అధ్యక్ష పదవిని కైవసం చేసుకోవడానికి అవసరమైన 270 ఎలెక్టోరల్ ఓట్లను నేను సాధించగలుగుతాను అని బైడెన్ వ్యాఖ్యానించారు. ప్రతి ఓటునూ లెక్కించాల్సిందే అని అన్నారు. మిషిగాన్ లో తాము 35 వేల ఓట్ల లీడ్ లో ఉన్నామని, ఈ సంఖ్య ఇంకా పెరుగుతోందని ఆయన చెప్పారు. ఓట్ల లెక్కింపును నిలిపివేయాలన్న ట్రంప్ పిలుపును ఆయన అపహాస్యం చేశారు. కోర్టుకెక్కేందుకు మేము కూడా రెడీగా ఉన్నాం అని జో బైడెన్ చెప్పారు.