కరోనాను కట్టడి చేస్తోన్న జపనీస్ ప్లూ మెడిసిన్..

చైనీస్ వైద్య అధికారులు వుహాన్, షెన్‌జెన్‌లో ఉన్న బాధిత రోగులపై నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ ఫలితాల ఆధారంగా, జపనీస్ తయారు చేసిన ఫ్లూ డ్రగ్ ఫెవిపిరవిర్ (అవిగాన్ ) కరోనా వైరస్ ప్రభావాన్ని తగ్గించడంలో కీలకంగా పనిచేసినట్టు తేలింది. ఈ మెడిసిన్ ద్వారా చికిత్స తీసుకున్న రోగుల ఉపిరితిత్తుల పనితీరు ఉత్తమ స్థాయిలో మెరుగుపడినట్లు వెల్లడైంది. ఈ ట్రయల్స్‌లో మొత్తం 340 మంది రోగులు పాల్గొన్నారు.  ఫ్లూ చికిత్సలో ఉపయోగం కోసం ఈ ఔషదాన్ని ఇప్పటికే అభివృద్ధి […]

కరోనాను కట్టడి చేస్తోన్న జపనీస్ ప్లూ మెడిసిన్..

Updated on: Mar 19, 2020 | 10:27 PM

చైనీస్ వైద్య అధికారులు వుహాన్, షెన్‌జెన్‌లో ఉన్న బాధిత రోగులపై నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ ఫలితాల ఆధారంగా, జపనీస్ తయారు చేసిన ఫ్లూ డ్రగ్ ఫెవిపిరవిర్ (అవిగాన్ ) కరోనా వైరస్ ప్రభావాన్ని తగ్గించడంలో కీలకంగా పనిచేసినట్టు తేలింది. ఈ మెడిసిన్ ద్వారా చికిత్స తీసుకున్న రోగుల ఉపిరితిత్తుల పనితీరు ఉత్తమ స్థాయిలో మెరుగుపడినట్లు వెల్లడైంది. ఈ ట్రయల్స్‌లో మొత్తం 340 మంది రోగులు పాల్గొన్నారు.

 ఫ్లూ చికిత్సలో ఉపయోగం కోసం ఈ ఔషదాన్ని ఇప్పటికే అభివృద్ధి చేసి, ఆమోదించినందున.. ఎటువంటి ప్రతికూల ప్రభావాలు కూడా కలిగి ఉండవని చైనా సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అధికారి జాంగ్ జిన్మిన్ తెలిపారు. ఈ మెడిసిన్ ఇచ్చిన రోగులలో 91 శాతం మందిలో ఉపిరితిత్తుల పరిస్థితి మెరుగుపడిందని పరిశోధకులు కనుగొన్నారు. స్థానిక మీడియా సంస్థ నిక్కీ ప్రకారం.. అవిగాన్ పేరుతో కూడా అమ్ముతున్న ఈ మెడిసిన్ ఫుజిఫిల్మ్ తోయామా కెమికల్ 2014 లో అభివృద్ధి చేసింది.