Pawan Kalyan Rajahmundry Tour: ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల దుస్థితిపై జనసేన పార్టీ కదిలింది. రోడ్లపై గుంతలను శ్రమదానంతో కొంతమేర బాగుచేయడానికి జనసేన చేపట్టిన కార్యక్రమంలో జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పవన్ చేపట్టిన శ్రమదానం కార్యక్రమం, బహిరంగ సభకు పోలీసులు అనేక ఆంక్షల నడుమ అనుమతినిచ్చారు. జనసేన కార్యకర్తలు, నేతలు రాజమండ్రికి రాకుండా సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు గట్టి బందోబస్తుని ఏర్పాటు చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు, కార్యకర్తలు సరికొత్తగా ఆలోచించారు. తమ సంకల్పం ముందు ఏ చర్యలు పనిచేయని చూపించారు.
పోలీసులు పవన్ కళ్యాణ్ టూర్ లో పాల్గొనడానికి జనసేన కార్యకర్తలు.. రోడ్డు బాటని విడిచారు. వాహనాల్లో దర్జాగా పయనించే వారు సైతం వాటన్నిటిని పక్కకు పెట్టారు. తమ అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొంటున్న కార్యక్రమంలో పాల్గొనడానికి జనసైనికులు అడ్డదారి వెదుక్కున్నారు. చేల గట్లు వెంట నడుస్తూ.. బురద ని సైతం లెక్కచేయకుండా చెప్పులను చేతుల్లో పట్టుకుని పవన్ కళ్యాణ్ సభకు హాజరయ్యారు. ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోని తాజాగా పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. నా జనసైనికులు , నా గుండెచప్పుళ్లు
మీరు సమాజానికి సుస్థిరతని తెచ్చే యోధులు .. మీకు నా కృతజ్ఞతలు , నేను మీకు రుణగ్రస్తుడని అంటూ ఆ వీడియోకి కామెంట్స్ ను జతచేశారు జనసేనాని. సర్కార్‌కు పవన్‌కు మధ్య తాజాగా రగులుతున్న రాజకీయం నేపథ్యంలో జనసేన నేతలు ప్రభుత్వం చేస్తున్న పనుల్లో లోపాలను ఎత్తి చూపి.. సత్తా చాటాలని భావిస్తున్నారు.
నా జనసైనికులు , నా గుండెచప్పుళ్లు
మీరు సమాజానికి సుస్థిరతని తెచ్చే యోధులు
మీకు నా కృతజ్ఞతలు , నేను మీకు రుణగ్రస్తుడని … ? pic.twitter.com/TO91ES9POc— Pawan Kalyan (@PawanKalyan) October 5, 2021
Also Read: తీవ్రమైన భుజం నొప్పితో బాధపడుతున్నారా.. ఈ సింపుల్ చిట్కాలతో చెక్ చెప్పండి..
ఇదే మా కథ సినిమా చూడండి.. ఎన్ ఫీల్డ్ బైక్స్ గెలుచుకోండి… వివరాల్లోకి వెళ్తే..