“పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదు”

తాను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.  దేశం కోసం ఎందరో బలిదానాలు చేశారని, వారి త్యాగాలు, లక్ష్యాల కోసమే వచ్చా అని స్పష్టం చేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో భారతమాతకు మహా హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు గవర్నర్‌ తమిళిసైతో పాటు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, అష్టావధాని గరికపాటి నరసింహారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చాలామంది విద్యార్థులు భారతమాత వేషధారణలో ఈ […]

పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదు
Follow us

|

Updated on: Jan 26, 2020 | 10:59 PM

తాను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.  దేశం కోసం ఎందరో బలిదానాలు చేశారని, వారి త్యాగాలు, లక్ష్యాల కోసమే వచ్చా అని స్పష్టం చేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో భారతమాతకు మహా హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు గవర్నర్‌ తమిళిసైతో పాటు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, అష్టావధాని గరికపాటి నరసింహారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చాలామంది విద్యార్థులు భారతమాత వేషధారణలో ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడారు. దేశానికి బలమైన నాయకత్వం కావాలని, మోదీ నాయకత్వంతోనే అది సాధ్యమన్నారు.  దేశ సేవలో కర్పూరంలా కరిగిపోవాలని ఉందని..దేశానికి సేవ చేయాలనే తపనతోనే బీజేపీతో కలిశానని పేర్కొన్నారు. హిందువులను ఊచకోత కోసే సెక్యులరిజం మనకు అవసరం లేదన్న పవన్,  పాక్‌లోని హిందువులకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు.