తొలిసారి వెనక్కి తగ్గిన జగన్.. ఎందులోనంటే ?

ఏపీ సీఎం జగన్ తాను తీసుకున్న ఏ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోరన్న అభిప్రాయం ఇప్పటి వరకు వుండేది. కానీ ఎప్పుడు పెరగాలో.. ఎప్పుడు తగ్గాలో తనకు బాగా తెలుసని చాటారు సీఎం జగన్. తాను తీసుకున్న ఓ నిర్ణయం నుంచి ఒక అడుగు వెనక్కి తగ్గారు సీఎం జగన్. అది కూడా తొలిసారిగా అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు ఏపీలో ఒకటవ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం ఇటీవల […]

తొలిసారి వెనక్కి తగ్గిన జగన్.. ఎందులోనంటే ?
Rajesh Sharma

|

Nov 09, 2019 | 5:19 PM

ఏపీ సీఎం జగన్ తాను తీసుకున్న ఏ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోరన్న అభిప్రాయం ఇప్పటి వరకు వుండేది. కానీ ఎప్పుడు పెరగాలో.. ఎప్పుడు తగ్గాలో తనకు బాగా తెలుసని చాటారు సీఎం జగన్. తాను తీసుకున్న ఓ నిర్ణయం నుంచి ఒక అడుగు వెనక్కి తగ్గారు సీఎం జగన్. అది కూడా తొలిసారిగా అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు

ఏపీలో ఒకటవ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రభుత్వ ఉత్తర్వుల వల్ల తెలుగు భాష అంతరించిపోతుందని భాషాభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. టిడిపి సహా పలు రాజకీయ పార్టీలు కూడా జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టాయి.

ఉద్యోగావకాశాల్లో పోటీ పెరిగిపోవడం వల్ల ఇంగ్లీషు భాష మీద పట్టు అనివార్యమన్న సంగతి ఒకవైపు.. సాంకేతిక రంగంలో ఇంగ్లీషు భాష అవసరం ఇంకోవైపు స్పష్టంగా కనిపించడం వల్లనే పదవ తరగతి వరకు ఇంగ్లీషు మీడియంను కంపల్సరీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయించిందని విద్యాశాఖ అధికారులు, వైసీపీ నేతలు వివరణ కూడా ఇచ్చారు. అయితే ఈ దుమారం మాత్రం కొనసాగుతూనే వుంది.

ఈ నేపథ్యంలో శనివారం విద్యాశాఖపై సమీక్ష జరిపిన ముఖ్యమంత్రి జగన్మ్మోహన్ రెడ్డి.. కీలక ఆదేశాలు జారీ చేశారు. ముందుగా అనుకున్నట్లుగా ఒకటి నుంచి 10వ తరగతి దాకా కాకుండా ఒకటి నుంచి ఆరో తరగతి వరకే ఇంగ్లీషు మీడియంను కంపల్సరీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ మేరకు విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముందుగా అనుకున్న పదవ తరగతి నుంచి కొంచె వెనక్కి తగ్గిన జగన్ సర్కార్ ఆరో తరగతి వరకు మాత్రమే ఇంగ్లీషు మీడియం కంపల్సరీ చేయనున్నారు. మలి దశలో పదవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంను కంపల్సరీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రభుత్వ పాఠశాల్లో ఉన్నత విద్యా స్థాయి వరకు ఇంగ్లీషు మీడియంగా మార్చేందుకు అనుకూల పరిస్థితులు లేకపోవడం వల్లనే జగన్ కొద్దిగా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తొలి దశలో ఆరోతరగతి వరకు ఇంగ్లీషును కంపల్సరీ చేయాలని, ప్రతీ పాఠశాలలో ఇంగ్లీష్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నవంబర్ 14న ప్రారంభం కానున్న నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో ఇంగ్లీషు ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu