అయోధ్య కేసులో ‘ సుప్రీం ‘ తీర్పు.. ఒవైసీ ఏమన్నారంటే ?

అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఇఛ్చిన తీర్పు పట్ల ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యాంగం పట్ల తమకు విశ్వాసం ఉందని, లీగల్ హక్కులకోసం తాము పోరాడుతామని ఆయన చెప్పారు.’ విరాళంగా ‘ మాకు ఐదెకరాల భూమి అక్కర్లేదు.. మమ్మల్ని సంతృప్తి పరచడానికి చూడకండి ‘ అన్నారాయన. ఈ తీర్పు పట్ల అసంతృప్తి ప్రకటించిన ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుతో ఒవైసీ ఏకీభవించారు. కోర్టు చెప్పిన ఐదెకరాల భూమిని తిరస్కరించాలని తాను […]

అయోధ్య కేసులో ' సుప్రీం ' తీర్పు.. ఒవైసీ ఏమన్నారంటే ?
Follow us
Anil kumar poka

|

Updated on: Nov 09, 2019 | 5:00 PM

అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఇఛ్చిన తీర్పు పట్ల ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యాంగం పట్ల తమకు విశ్వాసం ఉందని, లీగల్ హక్కులకోసం తాము పోరాడుతామని ఆయన చెప్పారు.’ విరాళంగా ‘ మాకు ఐదెకరాల భూమి అక్కర్లేదు.. మమ్మల్ని సంతృప్తి పరచడానికి చూడకండి ‘ అన్నారాయన. ఈ తీర్పు పట్ల అసంతృప్తి ప్రకటించిన ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుతో ఒవైసీ ఏకీభవించారు. కోర్టు చెప్పిన ఐదెకరాల భూమిని తిరస్కరించాలని తాను అభిప్రాయపడుతున్నట్టు ఆయన తెలిపారు. ‘ వాస్తవాలపై విశ్వాసం సాధించిన విజయమిది ‘ అని ఒవైసీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ‘ సుప్రీం బట్ నాట్ ఇన్ ఫాలిబుల్ ‘ అనే పుస్తకం తాలూకు ఫోటోను ఆయన ట్వీట్ చేశారు.