రామజన్మ భూమికి అనుకూలంగా ఏకగ్రీవ తీర్పు

అయోధ్య కేసులో సుప్రీంకోర్టు శనివారం చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విశిష్టమైన తీర్పును వెలువరించింది. రామజన్మ భూమికి అనుకూలంగా ఉత్తర్వులిస్తూ.. వివాదాస్పద స్థలంలో రామ మందిరం ఉండాలని, ముస్లిములకు తమ మసీదు కోసం ప్రత్యామ్నాయంగా 5 ఎకరాల భూమిని కేటాయించాలని సూచించింది. ఈ తీర్పులోని 10 ప్రధాన అంశాలిలా ఉన్నాయి. 1.అయోధ్యలో వివాదాస్థలమని చెబుతున్న మొత్తం 2.77 ఎకరాల భూమిని రామ్ లాలా న్యాస్ […]

రామజన్మ భూమికి అనుకూలంగా ఏకగ్రీవ తీర్పు
Follow us
Anil kumar poka

|

Updated on: Nov 09, 2019 | 3:53 PM

అయోధ్య కేసులో సుప్రీంకోర్టు శనివారం చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విశిష్టమైన తీర్పును వెలువరించింది. రామజన్మ భూమికి అనుకూలంగా ఉత్తర్వులిస్తూ.. వివాదాస్పద స్థలంలో రామ మందిరం ఉండాలని, ముస్లిములకు తమ మసీదు కోసం ప్రత్యామ్నాయంగా 5 ఎకరాల భూమిని కేటాయించాలని సూచించింది.

ఈ తీర్పులోని 10 ప్రధాన అంశాలిలా ఉన్నాయి.

1.అయోధ్యలో వివాదాస్థలమని చెబుతున్న మొత్తం 2.77 ఎకరాల భూమిని రామ్ లాలా న్యాస్ కు కేటాయించాలని కోరింది

2.మసీదు నిర్మాణానికి గాను ముస్లిములకు మరో చోట అయిదు ఎకరాలను కేటాయించాలని కేంద్రాన్ని, యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

3.ట్రస్ట్ ఏర్పాటు కోసం నిర్మోహి అఖాడాకు సంబంధించి ఏదో ఒక నిర్ణయం తీసుకునే అంశాన్ని పరిశీలించాలని కేంద్రాన్ని కోర్టు కోరింది. అయోధ్య కేసులో ఈ అఖాడా మూడో పార్టీగా ఉన్న విషయం విదితమే.

4.మొత్తం వివాదాస్పద భూమినంతా తమకే కేటాయించాలని, ఆ భూమికి తామే హక్కుదారులమని నిర్మోహి అఖాడా చేసిన వాదనను కోర్టు కొట్టివేసింది.

5.వివాదాస్పద స్థలంలో రామ మందిర నిర్మాణానికి గాను 3 నెలల్లోగా ట్రస్టును ఏర్పాటు చేయాలనీ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. (1992 లో అదే చోట బాబరీ మసీదును కూల్చివేశారు)

6.అయోధ్యలో ఈ స్థలం కింద గల కట్టడం ఇస్లామిక్ కట్టడం కాదని, అక్కడ మసీదు నిర్మాణానికి గాను ఆలయాన్ని కూల్చివేశారా అనడానికి పురావస్తు శాఖ ఆధారాలు చూపలేకపోయిందని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.

7.వివాదాస్పద స్థలం రాముడి జన్మ స్థలమని హిందువులు భావిస్తుంటారని, అయితే మసీదు స్థలం కూడా ఇదేనని ముస్లింలు చెబుతున్నారని కోర్టు పేర్కొంది

8.హిందువుల విశ్వాసాన్ని తోసిపుచ్ఛజాలమని కోర్టు వ్యాఖ్యానించింది.

9.1992 లో మసీదును నేలమట్టం చేయడం చట్ట ఉల్లంఘనే అని న్యాయమూర్తులు అన్నారు.

10.ఈ కేసులో సున్నీ వక్ఫ్ బోర్డు తన వాదనను నిరూపించలేకపోయిందని, అదే సమయంలో వివాదాస్పద స్థలం బయటి ప్రదేశం తమకే చెందుతుందని హిందువులు నిరూపించారని సుప్రీంకోర్టు తెలిపింది.

. .