షాకింగ్ పొలిటికల్ ట్రీట్మెంట్: రామతీర్థం ట్రస్ట్ ఛైర్మన్ పదవి నుంచి అశోక్ గజపతిరాజును తొలగిస్తూ జగన్ సర్కారు ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కారు రామతీర్థం ఘటన నేపథ్యంలో సంచలన నిర్ణయం తీసుకుంది. రామతీర్థం టెంపుల్ ట్రస్ట్ ఛైర్మన్ పదవి నుంచి అశోక్ గజపతిరాజును..

షాకింగ్ పొలిటికల్ ట్రీట్మెంట్: రామతీర్థం ట్రస్ట్ ఛైర్మన్ పదవి నుంచి అశోక్ గజపతిరాజును తొలగిస్తూ జగన్ సర్కారు ఉత్తర్వులు

Edited By:

Updated on: Jan 02, 2021 | 6:09 PM

రామతీర్థం ఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. రామతీర్థం టెంపుల్ ట్రస్ట్ ఛైర్మన్ పదవి నుంచి అశోక్ గజపతిరాజును తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అంతేకాదు, పైడితల్లి, మందపల్లి ఆలయ ట్రస్ట్ ఛైర్మన్ పదవుల నుంచి కూడా అశోక్ గజపతిరాజును తొలగించింది. విజయనగరం జిల్లా రామతీర్థం కొండ, ఇవాళ రణక్షేత్రంగా మారిన సంగతి తెలిసిందే. రామతీర్థం కొండపై వెలసిన శ్రీరాముడి విగ్రహం తల నరికిన దుండగులు అక్కడున్న కోనేరులో పడేయడంతో ఈ అంశం ఏపీలో తీవ్ర రాజకీయ ప్రకంపనలు లేపుతోంది. ఈ నేపథ్యంలో జగన్ సర్కారు ఆఘమేఘాలమీద అశోక్ గజపతిరాజుని తొలగిస్తూ టీడీపీ శ్రేణులపై పిడుగుపాటులాంటి చర్యకు ఉపక్రమించింది. లోకేష్ విసిరిన సవాల్ నాకోకే, ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ రెడీ, కాని స్వయంగా ఆయనే రావాలి: విజయసాయి