ఏపీలో పెళ్లిళ్లకు కొత్త మార్గదర్శకాలు.. ఈజీగా అనుమతులు..

|

Jul 19, 2020 | 1:31 AM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పెళ్లిళ్ల అనుమతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పలు మార్పులు చేసింది.

ఏపీలో పెళ్లిళ్లకు కొత్త మార్గదర్శకాలు.. ఈజీగా అనుమతులు..
Follow us on

New Guidelines For Marriages In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పెళ్లిళ్ల అనుమతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పలు మార్పులు చేసింది. ఇప్పటివరకు జిల్లా కలెక్టరేట్‌ల నుంచి పెళ్లిళ్లకు అనుమతి పొందాల్సి వచ్చేది. అయితే ఆ ప్రక్రియ కాస్తా ఆలస్యం అవుతుండటంతో.. మండల పరిధిలోని స్థానిక తహసీల్డార్లకు ఈ బాధ్యతలను అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం జీవోను జారీ చేసింది. జూలై 21 నుంచి శ్రావణ మాసం మొదలు కానుండటంతో పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరిగే అవకాశాలు ఉన్నాయి. దీనితో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

కేవలం పెళ్లిళ్లకు మాత్రమే అనుమతులు ఇవ్వాలని.. మరే ఇతర ఫంక్షన్లకు అనుమతి ఇవ్వకూడదని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. వధువు- వరుడు తరుపున 20 మంది మాత్రమే హాజరు కావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక పెళ్ళికి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునేవారు వివాహానికి హాజరయ్యే 20 మంది వివరాలతో పాటు పెళ్లి పత్రిక, ఆధార్ కార్డు, కరోనా రిపోర్టులతో పాటు రూ. 10 నాన్ జ్యుడీషియల్ స్టాంప్‌పై అఫిడవిట్‌ను తహసీల్డార్‌కు సమర్పించాల్సి ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే జాతీయ విపత్తు నిర్వహణ చట్టం తీసుకుంటామని జగన్ సర్కార్ జీవోలో పేర్కొంది.

Also Read:

వారికి వయోపరిమితి పెంపు.. సీఎం కేసీఆర్ వరాలు..

హైదరాబాద్‌లో మద్యం షాపులు బంద్.. కారణమదే..!

సచివాలయాల్లో ఆధార్ సేవలు.. జగన్ సర్కార్ మరో సంచలనం!

సుశాంత్ ఆత్మతో మాట్లాడిన హుఫ్ పారానార్మల్.. షాకిస్తున్న వీడియో..!

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ .. ఇంటర్‌లో 75% మార్కుల నిబంధన తొలిగింపు..