టీటీడీ ప్రక్షాళన దిశగా సీఎం జగన్ ఫోకస్

| Edited By:

Jul 03, 2019 | 8:10 PM

తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అవకతవకలపై దృష్టి సారించారు సీఎం వైఎస్ జగన్. గతంలో ఏ పాలకమండలిలో జరగననంత అవినీతి గత ప్రభుత్వం హయాంలో జరిగిందని జగన్ భావిస్తున్నారు. టీటీడీ బోర్డుకు ఇటీవల కొత్త ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డిని నియమించిన తర్వాత ఆలయం లోపల జరిగిన ప్రతి అవినీతిని వెలికితీసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఛైర్మన్ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ స్వామివారి నగలు,ఇతర ఆభరణాలపై అనేక ఆరోపణలున్నాయని వాటన్నిటిపై ఖచ్చితంగా విచారణ జరిపిస్తామని తెలిపారు. […]

టీటీడీ ప్రక్షాళన దిశగా సీఎం జగన్ ఫోకస్
Follow us on

తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అవకతవకలపై దృష్టి సారించారు సీఎం వైఎస్ జగన్. గతంలో ఏ పాలకమండలిలో జరగననంత అవినీతి గత ప్రభుత్వం హయాంలో జరిగిందని జగన్ భావిస్తున్నారు. టీటీడీ బోర్డుకు ఇటీవల కొత్త ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డిని నియమించిన తర్వాత ఆలయం లోపల జరిగిన ప్రతి అవినీతిని వెలికితీసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఛైర్మన్ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ స్వామివారి నగలు,ఇతర ఆభరణాలపై అనేక ఆరోపణలున్నాయని వాటన్నిటిపై ఖచ్చితంగా విచారణ జరిపిస్తామని తెలిపారు. శ్రీవారి ఆలయంలో జరిగిన అక్రమాలన్నీ అనుమానాలుగానే మిగిలిపోయాయి తప్ప.. భక్తులకు గత టీడీపీ ప్రభుత్వం నిజాలు తెలియనివ్వలేదని ఆరోపించారు.

మరోవైపు సీఎం జగన్ ప్రభుత్వం టీటీడీలో జరిగిన అక్రమాలను వెలికి తీసి దోషులు అధికారులైనా, నాయకులైనా సరే శిక్షపడేలా చేస్తుందన్నారు సుబ్బారెడ్డి. శ్రీవారికి ప్రపంచవ్యాప్తంగా భక్తులున్నారని, ప్రస్తుత ప్రభుత్వం స్వామివారి ప్రతిష్టను పెంచే విధంగా కృషిచేయనుందని ఆయన తెలిపారు.