‘కరోనా’ కట్టడికి ‘జాక్ మా’ భారీ విరాళం!

ఇ-కామర్స్ దిగ్గజం అలీబాబా వ్యవస్థాపకుడు, చైనాలోని అత్యంత ధనవంతుడు జాక్ మా.. ‘కరోనా వైరస్ పని పట్టేందుకు భారీ విరాళం ప్రకటించారు. వైరస్‌కు చెక్ పెట్టే వ్యాక్సీన్‌ను అభివృద్ధి చేసేందుకు దాదాపు 103 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. జాక్ యొక్క ఛారిటబుల్ ఫౌండేషన్ ద్వారా ఈ విరాళాలు ఇవ్వబడ్డాయి. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌కు చెందిన బిల్ అండ్ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌తో చేతులు కలిపారు. వీటిలో 5.8 మిలియన్ డాలర్లు చైనా ప్రభుత్వానికి […]

‘కరోనా’ కట్టడికి 'జాక్ మా' భారీ విరాళం!
Follow us

| Edited By:

Updated on: Jan 30, 2020 | 7:41 PM

ఇ-కామర్స్ దిగ్గజం అలీబాబా వ్యవస్థాపకుడు, చైనాలోని అత్యంత ధనవంతుడు జాక్ మా.. ‘కరోనా వైరస్ పని పట్టేందుకు భారీ విరాళం ప్రకటించారు. వైరస్‌కు చెక్ పెట్టే వ్యాక్సీన్‌ను అభివృద్ధి చేసేందుకు దాదాపు 103 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. జాక్ యొక్క ఛారిటబుల్ ఫౌండేషన్ ద్వారా ఈ విరాళాలు ఇవ్వబడ్డాయి. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌కు చెందిన బిల్ అండ్ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌తో చేతులు కలిపారు.

వీటిలో 5.8 మిలియన్ డాలర్లు చైనా ప్రభుత్వానికి చెందిన రెండు పరిశోధనా సంస్థలకు అప్పగించబడతాయి, మిగిలినవి “నివారణ మరియు చికిత్స” వైపు వెళ్తాయి. కాగా.. ‘కరోనా’ను నిరోధించే లక్ష్యంతో అలీబాబా సంస్థ ఇదివరకే భారత కరెన్సీ ప్రకారం 1000 కోట్లకు పైగా డొనేషన్ ప్రకటించింది. తాజాగా జాక్ మా ఈ మొత్తానికి అదనంగా వ్యక్తిగత హోదాలో విరాళం ప్రకటించారు. ‘మానవాళికి, రోగాలకు మధ్య జరుగుతున్న ఈ యుద్ధం‌లో ఇంకా చాలా దూరం ప్రయాణించాలన్న విషయం తెలిసిందే. ఈ మొత్తం రోగ నివారణకు, వైద్య రంగంలో పరిశోధనకు ఉపయోగపడుతుంది.’ జాక్‌ మా ఆధ్వర్యంలోని సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది.