AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Warangal: ఐటీ రంగంలో మరో ముందడుగు.. వరంగల్‌లో ఏర్పాటుకానున్న జెన్‌పాక్ట్‌

తెలంగాణలో హైదరాబాద్‌ తర్వాత అతి పెద్ద నగరమైన వరంగల్‌లో మరో ఐటీ కంపెనీ కొలువుదీరనుంది. ఇప్పటికే పలు ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ఇక్కడ ఏర్పాటుకాగా తాజాగా జెన్‌పాక్ట్‌ కూడా వచ్చేస్తోంది.

Warangal: ఐటీ రంగంలో మరో ముందడుగు.. వరంగల్‌లో ఏర్పాటుకానున్న జెన్‌పాక్ట్‌
Basha Shek
|

Updated on: Dec 17, 2021 | 10:54 AM

Share

తెలంగాణలో హైదరాబాద్‌ తర్వాత అతి పెద్ద నగరమైన వరంగల్‌లో మరో ఐటీ కంపెనీ కొలువుదీరనుంది. ఇప్పటికే పలు ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ఇక్కడ ఏర్పాటుకాగా తాజాగా జెన్‌పాక్ట్‌ కూడా వచ్చేస్తోంది. ఈ మేరకు కంపెనీ ప్రతినిధులు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. కాజీపేట మండలం మణికొండలోని స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌(ఎస్‌ఈజెడ్‌)లో టెక్‌ సెంటర్‌ ఏర్పాటుచేస్తున్నట్లు జెన్‌పాక్ట్‌ సీఈవో టైగర్‌ త్యాగరాజన్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా కంపెనీని ఆహ్వానిస్తూ మంత్రి ట్విట్టర్‌ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ‘వరంగల్‌ పట్టభద్రులకు జెన్‌పాక్ట్‌ మరో సువర్ణావకాశం కల్పిస్తోంది. ఉన్నచోటే ఉపాధి కల్పనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఐటీ అభివృద్ధికి విశేష కృషి చేస్తోంది’ అని మంత్రి పేర్కొన్నారు. కాగా వరంగల్‌లో ఇప్పటికే సైయంట్‌ టెక్‌, టెక్‌ మహేంద్ర, కాకతీయ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ తదితర ప్రముఖ సంస్థలు కొలువుదీరిన సంగతి తెలిసిందే. తాజగా జెన్‌పాక్ట్‌ ఏర్పాటుతో ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని ఐటీ నిపుణులు అంచనావేస్తున్నారు.

కాగా మరోవైపు పెడిగ్రీ( పెంపుడు జంతువుల పోషకాహారం) తయారీ కోసం మార్స్ పెట్‌కేర్ తన కార్యకలాపాలను ముమ్మరం చేసింది. మరో రూ.500 కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నట్టు వెల్లడించింది. ఈ సంస్థ హైదరాబాద్‌ నగరంలో 2008లో తన ఫ్యాక్టరీ ఏర్పాటు చేసింది. కుక్కలతో పాటు ఇతర పెంపుడు జంతువులు తినే ఆహార పదార్థాలు ఇక్కడ తయారవుతున్నాయి. దశాబ్ద కాలంగా పెంపుడు జంతువులకు పోషక ఆహారం అందించే విషయంలో ప్రజలకు అవగాహన పెరిగింది. ఫలితంగా ఈ మార్కెట్‌ పుంజుకుంది. పెడిగ్రీ బ్రాండ్ పెట్‌ ఫుడ్‌ మన హైదరాబాద్‌లోనే తయారవుతోంది. పెరుగుతున్న మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లోని ఫ్యాక్టరీ కెపాసిటీని పెంచాలని నిర్ణయించారు. ఇందు కోసం రూ.500 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్టు మార్స్‌ పెట్‌కేర్‌ సంస్థ వెల్లడించింది. కాగా పాత ఫ్యాక్టరీ సామర్థ్యాన్ని 65 కిలోటన్నులకు పెంచడం ద్వారా హైదరాబాద్‌ నుంచే మన దేశంతో పాటు ఇతర ఆసియా దేశాలకు పెంపుడు జంతువుల ఆహారం సరఫరా కానుంది.

Also Read:

Video Viral: తన యజమాని కారు పార్కింగ్ చేస్తుంటే.. కుక్క ఇచ్చిన డైరెక్షన్స్‌కు నెటిజన్లు ఫిదా.. మీరు కూడా ఓ లుక్ వేయండి మరి..

Hyderabad: ఓఆర్‌ఆర్‌ను తలదన్నేలా ఆర్‌ఆర్‌ఆర్‌.. ఎల్ఈడీ విద్యుద్దీపాల ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌..

Telangana: నేడు టీఆర్‌ఎస్‌ నేతలతో కేసీఆర్‌ విస్తృత స్థాయి సమావేశం.. చర్చకు రానున్న పలు కీలక అంశాలు..

పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?