AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video Viral: తన యజమాని కారు పార్కింగ్ చేస్తుంటే.. కుక్క ఇచ్చిన డైరెక్షన్స్‌కు నెటిజన్లు ఫిదా.. మీరు కూడా ఓ లుక్ వేయండి మరి..

Video Viral: సోషల్ మీడియా వేదికగా వినోదం, ఆశ్చర్యం కలిగించే అనేక వీడియోలు రోజు దర్శనమిస్తున్నాయి. వాటిల్లో కొన్ని మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉంటున్నాయి. అలాంటి వీడియోల్లో..

Video Viral: తన యజమాని కారు పార్కింగ్ చేస్తుంటే.. కుక్క ఇచ్చిన డైరెక్షన్స్‌కు నెటిజన్లు ఫిదా.. మీరు కూడా ఓ లుక్ వేయండి మరి..
Vidoe Viral
Surya Kala
|

Updated on: Dec 17, 2021 | 10:13 AM

Share

Video Viral: సోషల్ మీడియా వేదికగా వినోదం, ఆశ్చర్యం కలిగించే అనేక వీడియోలు రోజు దర్శనమిస్తున్నాయి. వాటిల్లో కొన్ని మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉంటున్నాయి. అలాంటి వీడియోల్లో ఎక్కువుగా కుక్క, పిల్లి, గున్న ఏనుగు వంటి వీడియోలు. పెంపుడు జంతువు కుక్కలకు చాలా తెలివితేటలు ఉన్నాయి. కొన్ని కుక్కల వీడియోలు చూడడానికి  నమ్మలేని విధంగా ఉంటాయి. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో, ఒక కుక్క కారును పార్క్ చేస్తోంది. తన యజమానికి కారు పార్క్ చేసే సమయంలో పలు డైరెక్షన్స్ ఇస్తుంది. దీంతో నెటిజన్లు కుక్క తెలివి తేటలకు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వీడియోలో ఓ వ్యక్తి కారు పార్క్ చేస్తున్నాడు. అదే సమయంలో, ఒక కుక్క కారు వెనుక కూర్చుని వ్యక్తికి పార్కింగ్ చేయడానికి పలు సూచనలు ఇస్తుంది. ముద్దుగా ఉన్న ఈ కుక్క తన రెండు పాదాల మీద కూర్చుని.. ముందు పాదాల పైకి ఎత్తిపెట్టుకుని సైగతో కారును పార్క్ చేయమని ఆ వ్యక్తికి చెబుతుంది. కుక్క పాదాలతో చేస్తున్న సైగలు చూస్తుంటే.. మనిషి చేతులతో సైడ్ చెబుతున్నట్టు అనిపిస్తుంది. అదే సమయంలో, కారును పార్కింగ్ చేసే వ్యక్తి కూడా కుక్క సూచనలను అనుసరించాడు. కుక్క కారుని ఆపివేయమని సంజ్ఞ చేసి చెప్పిన వెంటనే వ్యక్తి కారును ఆపివేశాడు. అనంతరం కుక్క తన నాలుగు కాళ్లపై కూర్చొని  వెనుక స్థలం లేదు కనుక కారుని ఇక ఆపమని అర్ధం వచ్చేలా మొరుగుతుంది.

ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను, జంతు ప్రేమికులను అమితంగా ఆకట్టుకుంది. కుక్క తెలివితేటలను ఫిదా అవుతున్నారు.  rvcjinsta అనే ఖాతాలో ఇన్‌స్టాగ్రామ్‌లో  ఈ  వీడియో షేర్ చేశారు.  ఫన్నీ కామెంట్స్ తో కుక్క తెలివి తేటలకు సోషల్ మీడియా వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తూ.. పలురకాల కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by RVCJ Media (@rvcjinsta)

Also Read:   ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రెండో రోజు కొనసాగుతున్న బ్యాంక్ ఉద్యోగులు సమ్మె…