Viral News: కిచెన్‌లో సీక్రెట్ డోర్.. తెరిచి చూడగా మహిళ షాక్.. లోపల ఏముందంటే.!
సాధారణంగా మనం కొత్త చోటుకు మారినప్పుడల్లా.. ఆ ప్రదేశం మొత్తాన్ని చుట్టుతిరిగి చూస్తుంటాం. రహస్య ద్వారాలు, మార్గాలు...
సాధారణంగా మనం కొత్త చోటుకు మారినప్పుడల్లా.. ఆ ప్రదేశం మొత్తాన్ని చుట్టుతిరిగి చూస్తుంటాం. రహస్య ద్వారాలు, మార్గాలు, చిత్రవిచిత్రమైన విషయాలు ఏమైనా ఉంటాయా అనే వాటి కోసం అన్వేషిస్తాం. అది పర్యాటక ప్రదేశం కావొచ్చు, హోటల్ కావొచ్చు.. లేదా సొంత ఇల్లు కావొచ్చు. ఆ చుట్టుప్రక్కల ఉండే ఇంటరెస్టింగ్ వాటిపై దృష్టిసారిస్తాం. అసలు ఎందుకు ఇదంతా చెబుతున్నానంటే.. ఇక్కడొక మహిళ.. ఇటీవల తన కొత్త ఇంటికి షిఫ్ట్ అయింది. ఇక ఆ ఇంటిలోని కిచెన్‌లో ఓ సీక్రెట్ డోర్ ఉందని గుర్తించింది. దాని గుండా వెళ్లి చూడగా ఆమెకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. మరో ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లుగా అనిపించిందట. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.
అమెరికాకు చెందిన ఓ మహిళ తన టిక్‌టాక్ అకౌంట్(@theresapizzaaa)లో ఒక వీడియోను అప్‌లోడ్ చేసింది. తన ఇంటికి సంబంధించిన వివరాలు చెబుతూ.. తనకు విసుగ్గా అనిపించినప్పుడు.. ఎక్కడికి వెళ్తానో నెటిజన్లకు వివరించింది. సదరు మహిళ ఆ వీడియోలో ఆమె ఇంట్లోని కిచెన్‌లో ఉండే ఓ సీక్రెట్ డోర్‌ను చూపించింది. ఇక ఆ రహస్య మార్గం గుండా ఆమె మెట్ల ద్వారా ఓ గదికి చేరుకుంది. అది కాస్తా వైన్స్(Wines)తో నిండి ఉంది. అంతేకాదు దానికి ఆనుకుని మరో గది.. అందులో ఓ పాత బుక్ షెల్ఫ్.. ఇక దాన్ని జరపగా.. ఆ షెల్ఫ్ వెనుక మరో తలుపు బయటపడుతుంది. దానిని ఓపెన్ చేయగా.. ఓ పార్టీ రూమ్‌లోకి ఎంటర్ కావచ్చు. ఆ రూమ్‌లో పెద్ద టీవీ, టేబుల్స్, కుర్చీలు ఉన్నాయి. తనకు ఎప్పుడు మూడ్ ఆఫ్ అయినా.. ఇక్కడికే వచ్చి సేద తీరుతానని ఆమె ఆ వీడియోలో పేర్కొంది.
కాగా, ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒకింత ఆశ్చర్యపోయినా.. ఆ తర్వాత తేరుకుని కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయాలను షేర్ చేశారు. కొంతమంది ఫన్నీ కామెంట్స్ చేయగా.. మరికొందరు సెటైరికల్‌గా కామెంట్ చేశారు. ”మీరు ఎంతటి ధనవంతులో తెలియడానికి మాకు ఇదంతా చూపించారా.?” అని ఒకరు కామెంట్ చేయగా.. ”మా సింక్ కింద షెల్ఫ్ తలుపులో ఏమి లేదని” మరొకరు వ్యంగ్యంగా కామెంట్ చేశారు.
Also Read:
బాత్రూమ్ గోడను రిపేర్ చేస్తోన్న ప్లంబర్‌కు ఊహించని షాక్.. బద్దలకొట్టి చూడగా ఫ్యూజులు ఔట్!
ఈ ఫొటోలో పామును గుర్తించడం అంత ఈజీ కాదండోయ్.. కనిపెట్టాలంటే స్టోరీ చదవాల్సిందే!