సఫారీలపై గెలుపు.. ఇదీ ఓ ఘన విజయమేనా?

అంతర్జాతీయ క్రికెట్‌ను టీమిండియా శాసిస్తోందని అని చెప్పడంలో వింతేమీ లేదు. విరాట్ కోహ్లీ నేతృత్వంలో భారత్ జట్టు అద్భుత విజయాలు అందుకుంటోంది. ప్రత్యర్థి టీమ్ ఏదైనా.. కోహ్లీసేన చూసి బెంబేలెత్తిపోతున్నారు. రీసెంట్‌గా సఫారీలతో స్వదేశంలో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా జట్టు ఎక్కడా కూడా భారత్‌కు తగినంత పోటీ ఇవ్వలేదని చెప్పొచ్చు. అయితే భారత్ అత్యుత్తమ మేటి జట్టని కొందరు అంటుంటే.. సఫారీల నిలకడలేమి వల్లనే భారత్ గెలిచిందని […]

సఫారీలపై గెలుపు.. ఇదీ ఓ ఘన విజయమేనా?
Follow us

| Edited By:

Updated on: Oct 22, 2019 | 5:36 PM

అంతర్జాతీయ క్రికెట్‌ను టీమిండియా శాసిస్తోందని అని చెప్పడంలో వింతేమీ లేదు. విరాట్ కోహ్లీ నేతృత్వంలో భారత్ జట్టు అద్భుత విజయాలు అందుకుంటోంది. ప్రత్యర్థి టీమ్ ఏదైనా.. కోహ్లీసేన చూసి బెంబేలెత్తిపోతున్నారు. రీసెంట్‌గా సఫారీలతో స్వదేశంలో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా జట్టు ఎక్కడా కూడా భారత్‌కు తగినంత పోటీ ఇవ్వలేదని చెప్పొచ్చు. అయితే భారత్ అత్యుత్తమ మేటి జట్టని కొందరు అంటుంటే.. సఫారీల నిలకడలేమి వల్లనే భారత్ గెలిచిందని మరికొందరు వాదిస్తున్నారు.

ఇదిలా ఉంటే దక్షిణాఫ్రికా జట్టులో కెప్టెన్ డుప్లెసిస్ తప్పితే.. ఇంకెవ్వరూ సీనియర్ ఆటగాళ్లు లేరన్న మాట వాస్తవం. డివిలియర్స్, ఆమ్లా లాంటి టెస్ట్ బ్యాట్స్‌మెన్ రీసెంట్‌గానే రిటైర్మెంట్ ప్రకటించారు. దీనితో సఫారీలకు పెద్ద దెబ్బ పడింది. అంతేకాకుండా స్వదేశంలో భారత్‌ను ఓడించడం అంత ఈజీ కాదు. మరోవైపు సఫారీలు స్పిన్‌తో ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఇక టీమిండియాకు స్పినే ప్రధాన బలం. ఇదంతా ఒక ఎత్తయితే.. మరో ఎత్తు టాస్.. మూడు టెస్టుల్లోనూ భారత్ మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

స్వదేశం.. అందులోనూ భారత్ టాస్ విజయం సాధిస్తే.. ఇంకేముంది ప్రత్యర్థులకు చుక్కల కనిపించడం ఖాయమే. సరిగ్గా మూడు టెస్టుల్లోనూ ఇదే జరిగింది. దానితో సఫారీలు ఒకింత కృంగిపోయారని కూడా చెప్పొచ్చు. భారీ స్కోర్.. అందులోనూ ఎదురున్నది బలమైన జట్టు.. ఖచ్చితంగా పొరపాట్లు జరుగుతాయి. సఫారీలు కూడా అదే తడబాటుతో సిరీస్ మొత్తాన్ని చేజార్చుకున్నారు.

భారత్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నది నిజమే. కానీ జట్టులో లోపాలు లేకపోలేదు. ప్రధానంగా మిడిల్ ఆర్డర్ ఇబ్బంది ఉంది. అంతేకాకుండా టెస్టుల్లో ఓపెనర్లు కూడా సరిగ్గా రాణించట్లేదు. ప్రస్తుతం రోహిత్ శర్మ రూపంలో అద్భుతమైన ఓపెనర్ ఉన్నాడు గానీ.. మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరూ చెప్పలేరు. అంతేకాకుండా భారత్ ఇప్పటివరకు చిన్నా చితక జట్లతోనే మ్యాచ్‌లు ఆడి గెలిస్తోంది తప్పితే.. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి జట్లతో ఇప్పటివరకు ఆడలేదు.

ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో