
దేశంలోని ప్రధాన పుణ్యక్షేత్రాలను, పవిత్ర నగరాలను సందర్శించడం అనేది చాలా మందికి ఓ కల. అన్ని సందర్శించడం ఓ భాగ్యమని చాలామంది భావిస్తుంటారు. జీవితకాలంలో పలు దఫాలుగా ఒక్కో పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోడానికి వెళ్తుంటారు. అయితే ఐఆర్‌సీటీసీ టూరిజమ్ విభాగం ఓ అద్భుత అవకాశాన్ని పర్యాటకులకు అందిస్తోంది. పది రోజుల పర్యటనలో ఆరు ముఖ్యమైన పుణ్యక్షేత్రాలను దర్శించుకునేలా ప్రత్యేక రైలును నడుపుతోంది. భారత్ గౌరవ్ టూరిస్ట్స్ ట్రైన్ ను ఇందుకోసం ప్రత్యేకంగా తీసుకొచ్చింది. స్లీపర్ క్లాస్, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ క్లాస్‌లలో ప్రయాణించే వీలుంది. పుణ్య క్షేత్ర యాత్ర: పూరి-కాశీ-అయోధ్య పేరిట తీసుకొచ్చిన ఈ ప్యాకేజీ రూ. 16,400 నుంచి ప్రారంభమవుతుంది.దీనిలో పూరి, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ నగరాలను సందర్శిస్తారు. అక్టోబర్ 12న ప్రారంభమయ్యే ఈ భారత్ గౌరవ్ టూరిస్ట్స్ ట్రైన్ పుణ్య క్షేత్ర యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
డే01(12.10.2023): మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి భారత్ గౌరవ్‌రైలు ప్రారంభమవుతుంది. కాజీపేట్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, పెందుర్తి, విజయనగరం స్టేషన్లలో పర్యాటకులను ఎక్కించుకొని ప్రయాణం సాగుతుంది. రాత్రంతా ప్రయాణం ఉంటుంది.
డే02(13.10.2023): ఉదయం 9.30 గంటలకు మల్తీపట్‌పూర్ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పూరీకి వెళ్తారు. జగన్నాథ ఆలయాన్ని సందర్శించి. రాత్రిక అక్కడే బస చేస్తారు.
డే03(14.10.2023): అల్పాహారం తర్వాత కోణార్క్‌లోని ప్రపంచ ప్రసిద్ధ సూర్య దేవాలయాన్ని సందర్శిస్తారు. తర్వాత గయాకు వెళ్లడానికి రైలు ఎక్కేందుకు మల్తీపట్‌పూర్ రైల్వే స్టేషన్‌కు తిరిగి వెళ్తారు.
డే04(15.10.2023): గయా చేరుకొని బోధ్ గయా-మహాబోధి దేవాలయం, విష్ణు పాద ఆలయాన్ని సందర్శిస్తారు. గయాలోనే రాత్రి బస చేస్తారు.
డే05(16.10.2023): గయా నుంచి వారణాసికి బయలుదేరుతారు. వారణాసికి చేరుకున్న తర్వాత సారనాథ్ స్మారక చిహ్నాలను సందర్శిస్తారు.
డే06(17.10.2023): అల్పాహారం తర్వాత కాశీ విశ్వనాథ ఆలయం, కారిడార్, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణా దేవి ఆలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం సాక్షి గంగా హారతిని సందర్శిస్తారు. అనంతరం అయోధ్యకు వెళ్లడానికి వారణాసి Jn నుండి రైలు ఎక్కండి.
డే07(18.10.2023): అయోధ్యకు చేరుకున్న తర్వాత హోటల్ లో చెకిన్ అయ్యి ఫ్రెష్ అవుతారు. అనంతరం రామజన్మ భూమి, హనుమాన్‌గర్హి సందర్శన, సరయు నది వద్ద సాయంత్రం హారతిని తిలకిస్తారు. అనంతరం అయోధ్య నుంచి ప్రయాగ్ రాజ్ కు రైలులో బయలుదేరుతారు.
రోజు08(19.10.2023): ఉదయం ప్రయాగ్‌రాజ్‌కి చేరుకుని పవిత్ర త్రివేణి సంగమం-గంగా, యమున, పౌరాణిక సరస్వతి-ఆచారాలు, హనుమాన్ మందిర్ సందర్శిస్తారు. అనంతరం హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమవుతారు. మధ్యాహ్నం రెండు గంటలకు రైలు ఎక్కుతారు. రాత్రంతా ప్రయాణం ఉంటుంది.
డే09/10(20.10.2023, 21.10.2023): పగలంతా రైలు ప్రయాణం ఉంటుంది. సాయంత్రం 6.45 గంటలకు విజయనగరం చేరుకుంటుంది. ఆ తర్వాత వరుసగా పెందుర్తి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, కాజీపేట్ స్టేషన్లలో పర్యాటకులను దించుతూ పదో రోజు ఉదయం 7.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..