AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికా దాడిని లెక్కచేయని ఇరాన్‌.. ఆ దేశంపై మరోసారి క్షిపణులతో విరుచుకుపడ్డ ఇరాన్‌ ఆర్మీ

అమెరికా ఇరాన్‌లోని అణు కేంద్రాలపై దాడి చేయడంతో ప్రపంచం ఉలిక్కిపడింది. ఇరాన్‌ ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. ఈ దాడులతో మూడో ప్రపంచ యుద్ధం ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్రంప్‌ శాంతి చర్చలకు పిలుపునిచ్చినప్పటికీ, ఉద్రిక్తతలు తగ్గేలా కనిపించడం లేదు.

అమెరికా దాడిని లెక్కచేయని ఇరాన్‌.. ఆ దేశంపై మరోసారి క్షిపణులతో విరుచుకుపడ్డ ఇరాన్‌ ఆర్మీ
Iran Attack
SN Pasha
|

Updated on: Jun 22, 2025 | 10:34 AM

Share

శనివారం రాత్రి అమెరికా ఇరాన్‌పై దాడి చేసింది. మూడు అణు కేంద్రాలపై విజయవంతంగా దాడి చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఈ దాడి తర్వాత యావత్‌ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అగ్రరాజ్య అమెరికా దాడి చేయడంతో ఇక ఇరాన్‌ కోలుకోవడం కష్టమే అని అంతా భావించారు. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. ఇరాన్‌ మరోసారి ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. ఇజ్రాయెల్‌ రాజధాని టెల్‌ అవీవ్‌తో పలు ప్రాంతాలపై క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడుల సమయంలో ఇరాన్‌కు చెందిన రెండు డ్రోన్లు కూల్చేసినట్లు ఇజ్రాయెల్‌ కూడా ప్రకటించింది. అమెరికా దాడి చేసిన తర్వాత కూడా ఇరాన్‌ వెనక్కి తగ్గకపోవడంతో ఈ దాడులు ఎక్కడికి దారి తీస్తాయో అని ప్రపంచ దేశాలని భయపడుతున్నాయి.

ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఇరాన్‌పై అమెరికా దాడి చేయడంతో ఇప్పుడు ఇరాన్‌కు మద్దతుగా రష్యా, చైనాలు బరిలోకి దిగితే.. అది భీకరమైన యుద్ధానికి దారి తీసే అవకాశం ఉంది. దీంతో.. ఇక మూడో ప్రపంచ యుద్ధం మొదలైట్టే అంటూ కొంతమంది నిపుణులు భావిస్తున్నారు. మరి తమ దాడి తర్వాత ఇరాన్‌ శాంతి చర్చలకు రావాలని, శాంతికి సమయం ఆసన్నమైందంటూ డొనాల్డ్ ట్రంప్‌ హెచ్చరించిన తర్వాత కూడా ఇరాన్‌, ఇజ్రాయెల్‌పై దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి