AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇరాన్‌పై దాడి తర్వాత.. తొలిసారి స్పందించిన ట్రంప్‌! భవిష్యత్తులో మరింత భయంకరంగా..

అమెరికా ఇరాన్‌లోని అణు కేంద్రాలపై దాడి చేయడంతో అంతర్జాతీయ ఉద్రిక్తతలు పెరిగాయి. ట్రంప్ ఇరాన్ శాంతి చర్చలకు రావాలని హెచ్చరించారు. ఇరాన్ ప్రతిదాడి చేయడానికి సిద్ధంగా ఉందని సూచించింది. ఈ సంఘటన ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా భద్రతా చర్యలు తీసుకుంటోంది.

ఇరాన్‌పై దాడి తర్వాత.. తొలిసారి స్పందించిన ట్రంప్‌! భవిష్యత్తులో మరింత భయంకరంగా..
Donald Trump
SN Pasha
|

Updated on: Jun 22, 2025 | 8:17 AM

Share

ఇజ్రాయెల్‌ దాడికి ఇరాన్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇవ్వడంతో.. ఇక ఇజ్రాయెల్‌తో పని కావడంలేదని నేరుగా అమెరికానే రంగంలోకి దిగింది. ఇరాన్‌లోని మూడో అణుకేంద్రాలపై శనివారం రాత్రి అమెరికా సైన్యం దాడులు నిర్వహించింది. ఈ దాడి తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ కీలక అంశాలు వెల్లడించారు. ఆదివారం ఉదయం అమెరికాలోని వైట్‌ హౌజ్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్‌.. ఇరాన్‌ కచ్చితంగా శాంతికి రావాల్సిందే అన్నారు. లేకపోతే భవిష్యత్తులో దాడులు మరింత తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ట్రంప్‌ మాట్లాడుతూ.. “ఇరాన్‌పై విజయవంతంగా దాడి చేశాం. ప్రపంచంలో మరే సైన్యం కూడా ఇలా దాడి చేయలేదు. ఇది అమెరికా సైనిక విజయం. ఇరాన్ కచ్చితంగా శాంతి చర్చలకు రావాల్సిందే. లేదంటే భవిష్యత్తులో మరింత తీవ్రమైన దాడులు చేస్తాం. మరింత కచ్చితత్వం, వేగం, నైపుణ్యంతో దాడులు చేస్తాం. దాడులు చేయాల్సిన లక్ష్యాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇక శాంతికి సమయం అసన్నమైంది. ఈ దాడుల సందర్భంగా ఇజ్రాయెల్‌కు ధన్యవాదలు.” అని ట్రంప్‌ అన్నారు.

ఇక తమపై అమెరికా దాడి చేస్తే.. కచ్చితంగా తిరిగి దాడి చేస్తామని ఇప్పటికే ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ ప్రకటించి ఉన్నారు. దీంతో.. ఇప్పుడు ఇరాన్‌ నుంచి అమెరికా సైనిక స్థావరాలపై కచ్చితంగా ప్రతి దాడి ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే ఇరాన్‌పై అమెరికా దాడి చేస్తే.. రష్యా, చైనా నుంచి ఇరాన్‌ను మద్దతు లభించే అవకాశం ఉందనే వాదనలు ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మొదలైనప్పటి నుంచి వినిపిస్తున్నాయి. మరి ఇరాన్‌కు మద్దుతగా రష్యా, చైనా వస్తాయా అనేది ఆసక్తికరంగా మారింది. ఒక వేళ అదే జరిగితే.. పరిస్థితి చేయి దాడి పోయి.. మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయొచ్చు.

ఇరాన్‌పై దాడి తర్వాత అమెరికా అలెర్ట్‌ అయింది. ఇరాన్‌పై దాడుల నేపథ్యంలో అమెరికాలో భద్రతా బలగాలను అప్రమత్తం చేశారు. ఇరాన్‌ నుంచి ప్రతిదాడి ఉంటుందని అమెరికా ఆందోళనలో ఉంది. అందుకోసం ముందుగానే సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భద్రతా సంస్థలు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. న్యూయార్క్‌లోని మత, సాంస్కృతిక ప్రదేశాలు, రాయబార కార్యాలయాల దగ్గర బందోబస్తు భారీగా పెంచారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి