మంచి స్కోరు చేసిన బెంగళూరు.. ముంబై టార్గెట్ 202..

దుబాయ్ లో జరుగుతున్న ఐపీఎల్ 10వ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది.

మంచి స్కోరు చేసిన బెంగళూరు.. ముంబై టార్గెట్ 202..
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 28, 2020 | 9:50 PM

దుబాయ్ లో జరుగుతున్న ఐపీఎల్ 10వ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 201 రన్స్ చేసింది. చివర్లో డివిలియర్స్ (55; 24 బంతుల్లో 4×4, 4×6) మెరుపు హాప్ సెంచరీకి తోడు శివమ్‌దూబె (27; 10 బంతుల్లో 1×4, 3×6) ధాటిగా ఆడడంతో ముంబై ముందు భారీ టార్గెట్ ఉంచింది. మొదట్లో పడిక్కల్ (40 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్స్‌)‌ మంచి సపోర్ట్ ఇవ్వడంతో ఫించ్‌ భారీ షాట్లతో రెచ్చిపోయాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు  81 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఈ క్రమంలోనే ఫించ్‌ అర్ధశతకం పూర్తయ్యాక ధాటిగా ఆడుతూ బౌల్ట్‌ బౌలింగ్‌లో పొలార్డ్‌ చేతికి చిక్కాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ కోహ్లీ (3; 11 బంతుల్లో) మరోసారి నిరాశపరిచాడు. రాహుల్‌ చాహర్‌ బౌలింగ్‌లో రోహిత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 2 వికెట్లు పడగొట్టగా, చాహర్ 1 వికెట్ తీశాడు.

Also Read :

డైలాగ్స్ రాస్తున్న రజినీకాంత్ !