రాములోరి భూమి పూజకు ఆహ్వానం ఇదే..
ఈ భూమి పూజను తిలకించేందుకు దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ అద్భుతమైన కార్యక్రమానికి అతిరథ మహారథులు రాబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతోపాటు..

Invitation Letter Ramjam bhumi pujan : వంద ఏళ్లుగా రామ భక్తులు ఎదురు చూస్తున్నఅయోధ్య రాములోరి ఆలయానికి శంకుస్థాన ఈ నెల 5 జరగబోతోంది. ఈ భూమి పూజను తిలకించేందుకు దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ అద్భుతమైన కార్యక్రమానికి అతిరథ మహారథులు రాబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతోపాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ జీ భగవత్‌తోపాటు మరికొందరు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.
అయితే రాముడి గుడి భూమిపూజ కోసం అతిథులకు పంపిన ఆహ్వాన లేఖ ఇప్పడు ఆసక్తికర అంశంగా మారింది. చాలా సింపుల్‌గా … నిరాడంబరమైన పద్దతిలో ఆహ్వాన పత్రికను అతిథులకు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పంపించింది. ఇందులో ప్రధాని మోడీ రాక గురించిన సమాచారం కూడా ఉంది. ఇంతేకాకుండా అతిథులు ఆగస్టు 4 న సాయంత్రానికే అయోధ్యకు చేరుకోవాలని ట్రాస్ట్ అభ్యర్థించింది.