ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల
ఇంటర్ సెకెండ్ ఇయర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలను బోర్డు కార్యదర్శి అశోక్ విడుదల చేశారు. ఈ పరీక్షల్లో హాజరైన వారిలో 37.76 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్టు ఆయన స్పష్టం చేశారు. మొత్తం 1.60.487 మంది విద్యార్ధులు ఈ పరీక్షలకు హాజరుకాగా, వీరిలో 60,600 మంది పాస్ అయ్యారని తెలిపారు. వీరిలో 97,179 మంది బాలురు హాజరుకాగా 34,490 మంది పాసయ్యారని, 63,308 మంది బాలికలు హాజరుకాగా.. 26, 181 మంది ఉత్తీర్ణత సాధించినట్టు కార్యదర్శి అశోక్ […]
ఇంటర్ సెకెండ్ ఇయర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలను బోర్డు కార్యదర్శి అశోక్ విడుదల చేశారు. ఈ పరీక్షల్లో హాజరైన వారిలో 37.76 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్టు ఆయన స్పష్టం చేశారు. మొత్తం 1.60.487 మంది విద్యార్ధులు ఈ పరీక్షలకు హాజరుకాగా, వీరిలో 60,600 మంది పాస్ అయ్యారని తెలిపారు. వీరిలో 97,179 మంది బాలురు హాజరుకాగా 34,490 మంది పాసయ్యారని, 63,308 మంది బాలికలు హాజరుకాగా.. 26, 181 మంది ఉత్తీర్ణత సాధించినట్టు కార్యదర్శి అశోక్ వివరించారు.
గత మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్షల ఫలితాలు తప్పుల తడకగా ఉండటంతో దాదాపు 20 మందికి పైగా విద్యార్ధలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో ప్రభుత్వం పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంపై ప్రత్యేక దృష్టిసారించింది. ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకుంది.