AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండియాతో బాటు మరో నాలుగు దేశాలు కూడా …

‘ చంద్రయాన్-2 ‘ మిషన్ కి అంతా సిధ్దమైంది. జులై 15… తెల్లవారు జామున.. 2 గంటల 51 నిముషాలకు శ్రీహరికోట నుంచి ఈ ప్రయోగానికి రెడీ అవుతున్నారు శాస్త్రజ్ఞులు. చంద్రయాన్-1 తరువాత చంద్రుని మీదికి ఇండియా తలపెట్టిన రెండో మిషన్ ఇది ! లాంచ్ డేట్ (సెప్టెంబరు 6 లేదా 7) నుంచి సుమారు 50 రోజుల్లో ఈ రెండో ఉపగ్రహం సౌత్ పోల్ సమీపంలో చంద్రునిపై దిగవచ్చు. ఇండియాతో బాటు మరో 4 దేశాలు […]

ఇండియాతో బాటు మరో నాలుగు దేశాలు కూడా ...
Anil kumar poka
|

Updated on: Jul 14, 2019 | 12:21 PM

Share

‘ చంద్రయాన్-2 ‘ మిషన్ కి అంతా సిధ్దమైంది. జులై 15… తెల్లవారు జామున.. 2 గంటల 51 నిముషాలకు శ్రీహరికోట నుంచి ఈ ప్రయోగానికి రెడీ అవుతున్నారు శాస్త్రజ్ఞులు. చంద్రయాన్-1 తరువాత చంద్రుని మీదికి ఇండియా తలపెట్టిన రెండో మిషన్ ఇది ! లాంచ్ డేట్ (సెప్టెంబరు 6 లేదా 7) నుంచి సుమారు 50 రోజుల్లో ఈ రెండో ఉపగ్రహం సౌత్ పోల్ సమీపంలో చంద్రునిపై దిగవచ్చు. ఇండియాతో బాటు మరో 4 దేశాలు కూడా ఈ మిషన్ లో పాలుపంచుకున్నాయి. అమెరికా, రష్యా (మాజీ సోవియట్ యూనియన్), చైనా, జపాన్ దేశాలు గతంలోనే ఈ మిషన్ చేపట్టి సక్సెస్ అయ్యాయి. అమెరికా విషయానికి వస్తే.. ఆ దేశం 1969 లో మొదటిసారిగా వ్యోమగామిని చంద్రునిపైకి పంపింది.

నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఈ మిషన్ ని చేబట్టింది. నాడు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్..చంద్రునిమీద కాలు మోపాడు. అంతకుముందు యుఎస్ మానవరహిత ఉపగ్రహాలను మూన్ పైకి ప్రయోగించింది. చివరిసారిగా.. 2013 సెప్టెంబరు 7 న ‘ ల్యాడీ ప్రోబ్ మిషన్ ‘ ఆ దేశం చేసిన ప్రయోగం. రష్యా (అప్పటి సోవియట్ యూనియన్) తరఫున తొలి వ్యోమగామి యూరి గగారిన్ చంద్రుని ‘ దర్శనం ‘ చేసుకున్నాడు. 1976 లో రష్యన్ ఏరో స్పేస్ కంపెనీ ‘ ఎన్ పీ ఓ లావోచోకిన్ ‘ మూన్ మిషన్ చేపట్టింది. చైనా విషయానికి వస్తే.. అక్కడి నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ 2007 అక్టోబర్ 24 న తన తొలి ల్యూనార్ మిషన్ కు శ్రీకారం చుట్టింది. 2013 లో ఆ దేశం తన ‘ ఖాంగే-3 ని , అనంతరం ఖాంగే-4 ని పంపినట్టు శాస్త్రజ్ఞులు వెల్లడించారు. ఇందులో చివరిది ఈ ఏడాది జనవరి 3 న చంద్రునికి సుదూరంగా అక్కడ అడుగు పెట్టడం విశేషం. ఇక-జపాన్.. 1990 లో హితేన్ అనే ఉపగ్రహాన్ని, సెలీన్ అనే ఉపగ్రహాన్ని 2007 లో లాంచ్ చేసింది.

ఇదిలా ఉండగా ఇండియా చేపట్టిన చంద్రయాన్-2 మిషన్ ని పలు అంతర్జాతీయ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ధనిక దేశాలతో సహా ఒక వర్ధమాన దేశం కూడా వీటి సరసన చేరడం వాటికి మింగుడు పడడంలేదు. ఇప్పటికే అంతరిక్ష రంగంలో భారత్ (ఇస్రో) చేపట్టిన పలు ఉపగ్రహ ప్రయోగాలు విజయవంతమయ్యాయి. ఇటీవలే ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ప్రయోగాన్ని కూడా ఇండియా చేపట్టి సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రయోగంవల్ల అంతరిక్షంలో పెద్ద సంఖ్యలో ఉపగ్రహ శకలాలు ఏర్పడ్డాయని అమెరికా వంటి దేశాలు గగ్గోలు పెడుతున్నాయి. ఈ శకలాల వల్ల రోదసిలో కాలుష్యం ఏర్పడుతోందని ఆ దేశ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.